Fake News, Telugu
 

ఫోటోలో ‘మూడు పెళ్లిళ్లు చేసుకోలేము క్షమించు అన్న’ అని జనసేన కార్యకర్త ఫ్లెక్సీ పట్టుకోలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.

0

ఒక ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి  ఒక సభ లో మాట్లాడుతుంటే, మరో వ్యక్తి ఒక ఫ్లెక్సీ పట్టుకుని కనిపిస్తాడు. ఆ ఫ్లెక్సీ లో ‘నువ్వు చేసుకున్నట్లు మూడు పెళ్లిళ్లు చేసుకోలేము క్షమించు అన్న’ అని జనసేన పార్టీ కి చెందిన వ్యక్తి తెలుపుతున్నట్లుగా ఉంటుంది. ఆ ఫోటో ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘నువ్వు చేసుకున్నట్లు మూడు పెళ్లిళ్లు చేసుకోలేము క్షమించు అన్న’ అని ఫ్లెక్సీ పట్టుకున్న జనసేన పార్టీ కార్యకర్త ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటో లో ఆ వ్యక్తి పట్టుకున్న ఫ్లెక్సీ లోని కొంత భాగం ఎడిట్ చేయబడింది. వాస్తవానికి ఆ ఫ్లెక్సీ లో ‘మిమ్మల్ని గెలిపించుకోలేకపోయాం మమ్మల్ని క్షేమించు అన్న’ అని ఉంటుంది. కావున, పోస్టు లో ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్ పెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఆ ఫోటో లోని ఫ్లెక్సీ లో జనసేన పార్టీ గుర్తు మరియు గాజువాక అని ఉండడం చూడవచ్చు. ఆ సమాచారంతో యూట్యూబ్ లో ‘Janasena gajuwaka meeting’ అని వెతికినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వాటిలో ‘ఈనాడు ఆంధ్ర ప్రదేశ్’ ఛానల్ వారి ఒక న్యూస్ వీడియో లో పోస్టులో పెట్టిన ఫొటోలో ఉన్న వ్యక్తులు కనిపిస్తారు మరియు ఆ ఫ్లెక్సీ లో  ‘మిమ్మల్ని గెలిపించుకోలేకపోయాం మమ్మల్ని క్షేమించు అన్న’ అని జనసేన పార్టీ కి చెందిన ఒక వ్యక్తి తెలుపుతున్నట్లుగా చూడొచ్చు. ఫ్లెక్సీ లో అదే విషయం ఉన్నట్లు ‘99టీవీ’ ఛానల్ వారి ప్రసారం లో కూడా చూడవచ్చు. కావున, పోస్టు లో ఉన్నది ఒక ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్.

చివరగా, పోస్టులో పెట్టిన ఫోటో లో జనసేన కార్యకర్త పట్టుకున్న ఫ్లెక్సీ లోని కొంత భాగం ఎడిట్ చేయబడింది .

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll