Fake News, Telugu
 

యెడ్యూరప్ప నాగసాధువులతో ఉన్న ఫోటోని ఎడిట్ చేసి, అందులో అమిత్ షా ని చేర్చారు

1

అమిత్ షా మరియు యెడ్యూరప్ప కొంతమంది సాధువులతో కూర్చున్నట్లుగా ఉన్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, ఈ విధంగా ఆరోపిస్తున్నారు- “ప్రపంచం దేశాలు, విజ్ఞానం, విద్య, వైద్యం, ఉపాధి, శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణల తో పోటీపడి, వారి దేశాలని నిర్మిస్తూవుంటే ఇక్కడ సన్నాసుల తో సమాలోచనలు చేసి, దేశాన్ని నిర్మిస్తూవున్నారు”. ఆ ఫోటో ఎంతవరకు వాస్తవమైనదో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  ఫొటోలో అమిత్ షా, యెడ్యూరప్ప మరియు సాధువులు ఉన్నారు.    

ఫాక్ట్ (నిజం): యెడ్యూరప్ప నాగసాధువులతో ఉన్న ఫోటోని ఎడిట్ చేసి, అందులో అమిత్ షా ని చేర్చారు. కావున, పోస్టులో పెట్టిన ఫోటో అవాస్తవమైనది. 

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినపుడు, చాలా రిజల్ట్స్ వచ్చాయి. అందులో ‘dailyhunt’ వారు ప్రచురించిన కథనం చూసినప్పుడు, అందులో ఉన్న ఫోటోలో కేవలం యెడ్యూరప్ప మరియు సాధువులు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు, యెడ్యూరప్ప నాగసాధువులను కలవడం గురించి “Tv9 Kannada” వారు ప్రసారం చేసిన న్యూస్ వీడియో ని చూసినప్పుడు కూడా ఆ సందర్భంలో అమిత్ షా అక్కడ లేనట్లుగా తెలుస్తుంది.

చివరగా, యెడ్యూరప్ప నాగసాధువులతో ఉన్న ఫోటోని ఫోటోషాప్ చేసి, అందులో అమిత్ షా ని చేర్చారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll