Fake News, Telugu
 

పది కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న మాజీ ఎం.పీ. లకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రద్దు చేయలేదు.

1

పది కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న మాజీ ఎం.పీ. లకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రద్దు చేసిందంటూ ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాల మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పదికోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉండి పెన్షన్ తీసుకుంటున్న మాజీ మంత్రులకు, మాజీ ఎంపీలకు పెన్షన్ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టుగా పది కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న మాజీ ఎం.పీ. లకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రద్దు చేయలేదు. ‘The Salary, Allowances and Pension of Members of Parliament Act, 1954’ చట్టం లో మాజీ ఎం.పీ. లకు నెలకు ఇరవై ఐదు వేలు పెన్షన్ (ఎం.పీ. గా ఉన్న కాల పరిమితి ఐదేళ్ళ కంటే ఎక్కువ ఉంటే, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది) వస్తుందని ఉంటుంది. పది కోట్ల పైన ఆస్తి ఉంటే పెన్షన్ రాదు అని ఎక్కడా కూడా రాసి ఉండదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం. 

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘Pension for ex-MPs with 10 crore assets removed’ అని వెతకగా, పది కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న మాజీ ఎం.పీ. లకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రద్దు చేసినట్టుగా ఎటువంటి సమాచారం దొరకలేదు.

ఒక వేళ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రద్దు చేయాలనుకుంటే ‘The Salary, Allowances and Pension of Members of Parliament Act, 1954’ చట్టాన్ని సవరించాలి. ఆ చట్టాన్ని చదవగా, అటువంటి మార్పు చేసినట్టు ఏమీ ఉండదు. ఆ చట్టం ప్రకారం మాజీ ఎం.పీ. లకు నెలకు ఇరవై ఐదు వేలు పెన్షన్ (ఎం.పీ గా ఉన్న కాల పరిమితి ఐదేళ్ళ కంటే ఎక్కువ ఉంటే, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది) వస్తుంది. ఇరవై వేలు ఉన్న పెన్షన్ ని గత సంవత్సరమే ఇరవై ఐదు వేలు చేసినట్టుగా ఈ ఆర్డర్ లో చదవచ్చు. 

మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన ఎం.పీ.లకు వచ్చే పెన్షన్ మరియు సదుపాయాల గురించి వివరిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఇచ్చిన నోటీసు లో కూడా మాజీ ఎం.పీ. ల పెన్షన్ ఇరవై ఐదు వేలు అని ఉంటుంది. పది కోట్ల ఆస్తి ఉంటే పెన్షన్ రాదు అని ఉండదు.

చివరగా, పది కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న ఎం.పీ. లకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రద్దు చేయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll