Fake News, Telugu
 

మహారాష్ట్రలో తీసిన ఫోటోని దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిగా షేర్ చేస్తున్నారు

0

పోస్ట్ తో పాటు ఉన్న ఫోటోను ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఫోటోగా షేర్ చేస్తున్నారు. మధ్యలో ఉన్న మహిళ 45 సంవత్సరాల వయస్సులో పెన్షన్ పొందింది అని, పక్కన నిద్రిస్తున్న వ్యక్తి వాహన మిత్ర పథకం ద్వారా పది వేలు పొందాడు అని, మంచంపై కూర్చున్న వ్యక్తి పనికిరాని ప్రాంతంలో ఇంటి స్థలం పట్టా అందుకున్నాడు అని షేర్ చేస్తున్నారు, ఇవన్నీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. ఇదే ఫోటీని తెలంగాణ మరియు గుజరాత్ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులకు ముడి పెడుతున్నారు. ఆ పోస్టు లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిని తెలియచేస్తున్న ఫోటో.

ఫాక్ట్: పోస్ట్ లో ఉన్న ఫోటో తీసింది మహారాష్ట్ర లోని నాగ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రి లో. ఈ ఫోటోకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించినప్పుడు, ‘టైమ్స్ నౌ’ న్యూస్ నెట్వర్క్ సీనియర్ న్యూస్ ఎడిటర్ మేఘా ప్రసాద్ పోస్ట్ చేసిన ట్విట్టర్ స్టేటస్ మాకు దొరికింది. ఈ ఫోటో మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందినదని తాను ఈ ట్వీట్ లో పేర్కొంది.

మరింత సమాచారం కోసం వెతికినప్పుడు, ఎన్ డిటివి మరియు న్యూస్18 వార్తలు నివేదికలను మనం చూడవచ్చు. వీటిలో కూడా ఇది నాగ్ పూర్ లో అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే మంచంపై కూర్చున్న పరిస్థితి అని తెలిపారు. మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు పెరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. ఈ రిపోర్ట్స్ లోని ఫోటోలు పోస్ట్ లో ఇచ్చిన ఫోటోని పోలి ఉండడం మనం చూడొచ్చు.

మనం ఆ ఫోటోను సరిగ్గా చూస్తే, దిగువన ఉన్న బెడ్ నంబర్ మరాఠీలో రాసి ఉంది అని మనం చూడవచ్చు. కాబట్టి, పోస్ట్ తో పాటు ఉన్న ఫోటో మహారాష్ట్ర నుండే అయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలో స్థానిక భాష మరాఠీ.

కావున, పైన ఉన్న ఫోటో కు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాలకు ఎటువంటి సంబంధంలేదు. మహారాష్ట్ర లో తీసిన ఫోటో ని వివిధ రాష్ట్రాలకు సంబంధించింది అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

వివరణ (APRIL 21, 2021):
మొదట ఈ ఆర్టికల్ లో కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన ఫోటోగా క్లెయిమ్ లో తీసుకోగా, ఇప్పుడు తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాలకు ఇదే ఫోటోను ముడిపెడుతున్న నేపథ్యంలో, ఆర్టికల్ లో ఆ వివరాలను జత చేర్చాము.

Share.

About Author

Comments are closed.

scroll