Fake News, Telugu
 

ఒక రష్యన్ ఆర్టిస్ట్ చేసిన పెయింటింగ్‌ను పంజ్‌షీర్ ప్యాలెస్‌లోని పెయింటింగ్ అని అంటున్నారు

0

ఈ అద్భుతమైన పెయింటింగ్ నాటి గాంధారంలో భాగమైన పంజ్‌షీర్ ప్యాలెస్‌లోని పెయింటింగ్” అని అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పంజ్‌షీర్ ప్యాలెస్‌లో ఉన్న కృష్ణుడి, పాండవుల పెయింటింగ్ ఫోటో.

ఫాక్ట్: ఆర్ట్ ఎస్.పి.బి అనబడే రష్యన్ ఆర్ట్ గ్యాలరీ వెబ్సైటులో ఈ పెయింటింగ్ యొక్క ఫోటో ఉంది. రసికానంద అనబడే రష్యన్ ఒక ఆర్టిస్ట్ దీనిని తయారు చేసారు. రసికానంద తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ పెయింటింగ్ పంజ్‌షీర్ ప్యాలెస్‌ కు సంబంధించింది కాదని వివరణ ఇచ్చారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఇమేజ్ ఒక రష్యన్ ఆర్ట్ గ్యాలరీ వెబ్సైటులో లభించింది. “కృష్ణా అండ్ ది పాండవాస్ (Krishna And The Pandavas)” అనే టైటిల్‌తో ఉన్న ఈ పెయింటింగ్, రసికానంద అనబడే రష్యన్ చేసినట్టు వెబ్సైటు ద్వారా తెలుస్తుంది. 1999 నుండి ఆర్ట్ ఎస్.పి.బి అనబడే ఈ ఆర్ట్ గ్యాలరీ నేరుగా సంస్థలు మరియు వ్యక్తులతో కలిసి ఇంటీరియర్ల మీద పనిచేస్తున్నారని వెబ్సైటులో పేర్కొన్నారు.

రసికానంద 1973లో కొమ్సోమోల్స్క్-ఆన్-అమూర్ లో జన్మించాడని, 1990 నుండి 1993 వరకు వ్లాదివోస్టోక్ ఆర్ట్ స్కూల్ లో చదువుకున్నాడని అతని బయో ద్వారా తెలుస్తుంది. ఇటువంటి క్లెయిమ్ గురించి కొంతమంది అతన్ని ఇంతకముందే సంప్రదించారని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ అని తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు.

చివరగా, ఒక రష్యన్ ఆర్టిస్ట్ చేసిన కృష్ణుడి, పాండవుల పెయింటింగ్‌ను పంజ్‌షీర్ ప్యాలెస్‌లోని పెయింటింగ్ అని అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll