Coronavirus Telugu, Fake News, Telugu
 

బ్రీతింగ్ టెస్ట్ ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చనే వార్తలో నిజం లేదు

0

30 సెకండ్ల నిడివి గల ఒక బ్రీతింగ్ (శ్వాస) ఎక్షర్సైజ్ వీడియోని షేర్ చేస్తూ, ఈ ఎక్షర్సైజ్ ని సరిగ్గా చేస్తే ఊపిరితిత్తులు బాగున్నట్టని, వారికి కరోనా సోకలేదని అర్ధమని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి సంబంధించిన 30 సెకండ్ల నిడివిగల బ్రీతింగ్ టెస్ట్ వీడియో.

ఫాక్ట్ (నిజం): ప్రస్తుతానికి కేవలం PCR, యాంటిజెన్ మరియు యాంటీబాడీ టెస్ట్ల ద్వారా మాత్రమే కరోనా నిర్ధారణ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే 10 సెకండ్స్ ఊపిరి బిగబట్టు కోవడం ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చని ఒక వార్త వైరల్ అయినప్పుడు WHO మరియు PIB ఈ వార్తలో నిజంలేదని స్పష్టం చేసాయి.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్తున్న దాని ప్రకారం ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో తెల్సుకోవడానికి ప్రస్తుతం మూడు టెస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

  • PCR
  • యాంటిజెన్
  • యాంటీబాడీ

కేవలం ఈ మూడు టెస్టుల మాత్రమే కరోనా నిర్ధారణ పరిక్షలుగా గుర్తించారు, భారత దేశంలో కూడా ఈ మూడు టెస్టుల ద్వారానే కరోనాని గుర్తిస్తున్నారు. గతంలో ఇలాగే 10 సెకండ్స్ ఊపిరి బిగబట్టు కోవడం ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చని ఒక వార్త వైరల్ అయినప్పుడు WHO ఈ వార్తలో నిజంలేదని స్పష్టం చేసింది.

భారతదేశంలో కూడా కరోనా కి సంబంధించిన 10 సెకండ్స్ ఊపిరి బిగబట్టే వార్త వైరల్ అయినప్పుడు, PIB ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది.

యూనివర్సిటీ అఫ్ మేరీల్యాండ్ UCH లో అంటు వ్యాధుల విభాగంలో వైస్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ఫహీమ్ యూనస్ కూడా ఇలా 10 సెకండ్లు ఊపిరి బిగబట్టడం ద్వారా కరోనా సోకిందో లేదో గుర్తించోచన్న వార్తలో నిజంలేదని ఒక ట్వీట్ ద్వారా తెలిపాడు. ఒకవేళ ఇలా ఒక బ్రీతింగ్ టెస్ట్ ద్వారా కరోనాని గుర్తించ గలిగితే వార్తా సంస్థలు గాని లేక ప్రభుత్వం గాని దీని గురించి ప్రచారం చేసేవి. కాని ఇలాంటి బ్రీతింగ్ టెస్ట్ ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చని చెప్తూ ఎటువంటి వార్తా కథనాలు లేవు. వీటన్నిటి బట్టి పోస్టులో చెప్పే వార్తలో నిజంలేదని అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం దేశంలో కరోనా కరోనా కేసుల పెరుగుతుండడం మరియు చాలా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, బ్రీతింగ్ టెస్ట్ ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చనే వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll