Fake News, Telugu
 

పాత వీడియోని మిగ్‌జాం తుఫాన్ ధాటికి కపిలతీర్ధం జలపాతం వరద నీటితో భారీగా ఉప్పొంగుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

తిరుపతిలోని కపిలతీర్ధం జలపాతంలో వరద నీరు భారీగా ఉప్పొంగుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. మిగ్‌జాం తుఫాన్ ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు వరద నీరుతో జలమయమైన నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మిగ్‌జాం తుఫాన్ ధాటికి వరద నీటితో తిరుపతి కపిలతీర్ధం జలపాతం భారీగా ఉప్పొంగుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2021 నవంబర్ నెలలో తిరుపతిలోని కపిలతీర్ధం జలపాతంలో వరద నీరు భారీగా చేరిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో పాతది మరియు ప్రస్తుత  మిగ్‌జాం తుఫాన్‌కు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇదే వీడియోని TV9 వార్తా సంస్థ 21 నవంబర్ 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. భారీ వరద నీటికి కపిలతీర్ధం మండపం కుప్పకూలిందంటూ TV9 వార్తా సంస్థ ఈ వీడియోని షేర్ చేస్తూ రిపోర్ట్ చేసింది. ఈ వీడియోని సోషల్ మీడియా యూసర్లు చాలా మంది 2021 నవంబర్ నెలలో షేర్ చేశారు.

2021 నవంబర్ నెలలో భారీ వర్షాల కారణంగా కపిలతీర్ధం మండపం కూలిపోయిన విషయాన్ని అనేక వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

మిగ్‌జాం తుఫాన్‌ కారణంగా తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు కపిలతీర్ధం జలపాతం వరద నీటితో భారీగా ఉప్పొంగుతుందని ఇటీవల కొన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కానీ, వీడియోలో షేర్ చేసిన వీడియో పాతది, మిగ్‌జాం తుఫాన్‌కు సంబంధించినది కాదు.

చివరగా, పాత వీడియోని మిగ్‌జాం తుఫాన్‌ ధాటికి కపిలతీర్ధం జలపాతం భారీ వరద నీటితో ఉప్పొంగుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll