Fake News, Telugu
 

పాత వీడియోని పెట్టి, ‘ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతున్న విధ్వంసం’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

కొంతమంది వ్యక్తులు పోలీసుల సమక్షంలో విధ్వంసం సృష్టిస్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది ప్రస్తుతం ఢిల్లీ వీధుల్లో జరుగుతున్న విధ్వంసానికి సంబంధించినదని పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పిన విషయంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతున్న విధ్వంసానికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా లో కనీసం 1 జులై 2019 నుండి ఉంది. కావున, ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతున్న విధ్వంసానికి సంబంధించిన వీడియో అనడం తప్పు.    

వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో తో ఉన్న మరొక ఫేస్బుక్ పోస్టు లభించింది. దానిని ఒకరు 01 జులై 2019 న అప్లోడ్ చేశాడు. కానీ, ఆ యూజర్ పోస్టులోని వీడియోకి సంబంధించిన స్పష్టమైన సమాచారామేమీ పెట్టలేదు. అదే వీడియోని యూట్యూబ్ లో కూడా  జులై 2019 లోనే పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. సోషల్ మీడియా లో కనీసం 1 జులై 2019 నుండి వీడియో చలామణీ లో ఉన్నట్లుగా తెలిసింది. కాబట్టి, అది ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతున్న విధ్వంసానికి సంబంధించినది కాదు అని చెప్పవచ్చు.

అదే వీడియో తప్పుడు ఆరోపణతో గత సంవత్సరం ‘సెప్టెంబర్’ లో సోషల్ మీడియా లో చలామణీ అయినప్పుడు, ‘BOOM’ వారు అది వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన వీడియో అని రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పాత వీడియోని పోస్టు చేసి, ‘ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతున్న విధ్వంసం’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll