తెలంగాణలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున 20 ఏప్రిల్ 2021 నుండి 30 ఏప్రిల్ 2021 (1 మే ఉదయం) వరకు రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ (రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు) విధించింది. అయితే, మొదటి రోజు రాత్రి కర్ఫ్యూలో ఒక వ్యక్తి బయటికి వచ్చినందుకు పోలీసులు అతన్ని కొడుతున్న వీడియో అని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తాజాగా తెలంగాణ ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూలో బయటికి వచ్చినందుకు పోలీసులు ఒకతన్ని కొడుతున్న వీడియో.
ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో పాతది. గత సంవత్సరం మార్చి నెలలో కూడా ఇదే వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. వీడియో తాజాగా విధించిన రాత్రి కర్ఫ్యూ కి సంబంధించింది కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, వీడియోకి సంబంధించిన సమాచారం సెర్చ్ రిజల్ట్స్ లో రాలేదు. అయితే, కొన్ని కీ-వర్డ్స్ మరియు టైం ఫిల్టర్లు ఉపయోగించి వెతకగా, అదే వీడియోని ఒకరు గత సంవత్సరం మార్చి నెలలో ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియో వివరణ లో ‘Khilwath murgi chowk’ అని రాసి ఉంది, కానీ ఆ వీడియో ఎక్కడిదో కచ్చితమైన సమాచారం లభించలేదు. కాకపోతే, వీడియో గత సంవత్సరం నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది కాబట్టి, అది తాజా రాత్రి కర్ఫ్యూ కి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవొచ్చు.
ఇంకొక వీడియోని (ఆర్కైవ్డ్) కూడా ‘బ్యాటింగ్ స్టార్ట్ అయింది జార జాగ్రత్త… నైట్ కరఫ్యూ కొనసాగుతుంది జర జాగ్రత్త’ అని చెప్తూ, కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, అది కూడా పాత వీడియోనే. మార్చి 2020 లో ఆ వీడియోని పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, పాత వీడియోలను పెట్టి, తెలంగాణలో విధించిన రాత్రి కర్ఫ్యూలో బయటికి వచ్చినందుకు పోలీసులు కొడుతున్నారని తప్పుగా షేర్ చేస్తున్నారు.