Fake News, Telugu
 

పాత వీడియోని చూపిస్తూ చైనా ఆక్రమించిన రెక్విన్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఆనందంలో చిందులేస్తున్న భారత సైనికులు అని షేర్ చేస్తున్నారు

0

నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కోల్పోయిన ఆక్సాయ్ చిన్ లోని రెక్విన్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఆనందంలో చిందులేస్తున్న భారత సైనికులు, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్: చైనా ఆక్రమించిన ఆక్సాయ్ చిన్ లోని రెక్విన్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఆనందంలో చిందులేస్తున్న భారత సైనికుల వీడియో

ఫాక్ట్ (నిజం): 29/30 ఆగష్టు 2020 నాటి రాత్రి పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA) అఫ్ చైనా ఈస్టర్న్ లడఖ్ లో చొరబడటానికి చేసిన ప్రయత్నాన్ని భారత జవాన్లు అడ్డుకున్నారని కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో పేర్కొంది. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ‘27 ఆగష్టు 2020’ నాటి నుంచే ఇంటర్నెట్ లో ఉన్నట్టు విశ్లేషణలో తెలిసింది. కాబట్టి, పోస్టులో షేర్ చేసిన ఆ వీడియోకి ఈస్టర్న్ లడాఖ్ లో జరిగిన ఘర్షణకి ఎలాంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ వీడియోకి సంబంధించి ఎలాంటి సమాచారం దొరకలేదు. పోస్టులోని ఆ వీడియోని జాగ్రాత్తగా గమనించగా, వీడియోలో కనిపిస్తున్న జెండా టిబెట్ దేశం యొక్క జెండాని పోలి ఉన్నట్టు గుర్తించాము. ఈ ఆధారంతో ఆ వీడియో కోసం గూగుల్ లో వెతకగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న ఒక వీడియో యూట్యూబ్ లో దొరికింది. ఈ వీడియోని ఆ యూట్యూబ్ ఛానెల్ ‘27 ఆగష్టు 2020’ నాడు పోస్ట్ చేసారు. అదే రోజు ఈ వీడియోని చాల మంది యూసర్లు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసారు. 29/30 ఆగష్టు నాటి రాత్రి పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA) అఫ్ చైనా ఈస్టర్న్ లడఖ్ లో చొరబడటానికి చేసిన ప్రయత్నాన్ని భారత జవాన్లు అడ్డుకున్నారని భారత రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో పేర్కొంది. కాబట్టి, పోస్టులో షేర్ చేసిన ఆ వీడియోకి ఈస్టర్న్ లడాఖ్ లో పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA) అఫ్ చైనా తో జరిగిన ఘర్షణకి ఎలాంటి సంబంధం లేదు.

భారత్ – చైనా సరిహద్దు రేఖ అయిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ( LAC ) సమీపంలో ఎతైన పర్వతాలని భారత సైనిక బలగం అయిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఆక్రమించింది అని పలు న్యూస్ వెబ్ సైట్స్ ఆర్టికల్స్ రాసారు. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ గురించిన సమాచారం కోసం ఇక్కడ చూడవచ్చు.

చివరగా, భారత సైనికులు చిందులేస్తూన్నట్టు షేర్ చేస్తున్న ఈ వీడియో 29/30 ఆగష్టు నాటి రాత్రి  ఈస్టర్న్ లడఖ్ లో పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA)తో జరిగిన ఘర్షణకి సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll