Fake News, Telugu
 

‘గిల్గిట్-బాల్టిస్తాన్, లడఖ్ (యు.టి), ఇండియా’ (@GB_Ladakh_India) అనే ట్విట్టర్ ప్రొఫైల్ అధికారిక హ్యాండిల్ కాదు

0

‘ఆఫీస్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ ఆఫ్ లడఖ్’ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌కు ‘గిల్గిట్-బాల్టిస్తాన్, లడఖ్ (యు.టి), ఇండియా’ అని పేరు మార్చారని క్లెయిమ్ చేస్తూ దాని ట్విట్టర్ ప్రొఫైల్ యొక్క స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ, FACTLY విశ్లేషణలో ఆ ట్విట్టర్ హ్యాండిల్ (@GB_Ladakh_India) అధికారిక హ్యాండిల్ కాదని తెలిసింది. ఆ ప్రొఫైల్ ని మే 2020 లో క్రియేట్ చేసారు, ఇప్పుడు దాని ప్రొఫైల్ డిస్క్రిప్షన్ నుండి ‘అఫీషియల్’ అని కూడా తీసేసారు (పోస్ట్ చేసిన ఫోటో లోని ప్రొఫైల్ డిస్క్రిప్షన్ లో ‘అఫీషియల్’ అని ఉండడం చూడవచ్చు). అంతేకాక, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా ఇది ఒక ఫేక్ హ్యాండిల్ అని మరియు లడఖ్ యొక్క UT కి రెండు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ మాత్రమే ఉన్నాయని (@DIPR_Leh మరియు @InformationDep4) స్పష్టం చేసింది.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. PIB ట్వీట్ – https://twitter.com/PIBFactCheck/status/1260448160096419841

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll