Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి, తాజాగా ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడి వీడియో అంటూ ప్రచారం చేస్తున్నారు

0

తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని ‘థాంగ్దర్ సెక్టార్’ లో ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన దాడులకి సంబంధించిన వీడియో అని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాజాగా ‘థాంగ్దర్ సెక్టార్’ లో ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన దాడులకి సంబంధించిన వీడియో. 

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియోని మార్చి నెలలోనే కొందరు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టుగా చూడవచ్చు. పోస్ట్ లోని వీడియోకి తాజాగా జరిపిన దాడులకి సంబంధం లేదు. అంతేకాదు, కొందరు ఇదే వీడియోని పెట్టి భారత్ పై పాక్ దాడి చేసిన వీడియో అని రాస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో చేయగా, చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. పోస్ట్ లో ఉన్న వీడియోనే ఒకరు యూట్యూబ్ లో మార్చి నెలలోనే పోస్ట్ చేసినట్టుగా చూడవొచ్చు. ఆ వీడియో యొక్క టైటిల్ చూస్తే ‘Pakistan Firing on LoC’ అని రాసి ఉంటుంది. ఈ వీడియో గురించి ఇంకెటువంటి సమాచారం ఇంటర్నట్ లో దొరకలేదు. మార్చి-2019 లో భారత్ మరియు పాక్ మధ్య ఫైరింగ్ జరిగినట్టు న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ చూడవొచ్చు. కానీ, ఆ వీడియోకి ఈ ఫైరింగ్ తో సంబంధం ఉన్నట్టు చెప్పలేము.

తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని ‘థాంగ్దర్ సెక్టార్’ లో ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన దాడులు చేసినట్టు ఇక్కడ చదవొచ్చు. కానీ, ఆ దాడికి, పోస్ట్ లో పెట్టిన వీడియోకి సంబంధం లేదు.

చివరగా, పాత వీడియో పెట్టి, తాజాగా ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడి వీడియో అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll