Fake News, Telugu
 

2020లో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి తండ్రిని పోలీసులు తన్నిన పాత వీడియో ఇప్పుడు జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు

0

ఇటీవల వరంగల్‌లో మెడికో ప్రీతి ఆత్మహత్య మరియు హైదరాబాద్ నార్సింగిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో మూడు సంవత్సరాల క్రితం ఒక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఈ వీడియోలో పోలీసులు ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి తండ్రిని తన్నుతూ కనిపిస్తారు.  ఇటువంటి వీడియో ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి తండ్రిని తెలంగాణ పోలీసులు కాలితో తంతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ దృశ్యాలకు ఇటీవల జరిగిన ఘటనలకు ఎటువంటి సంబంధంలేదు.ఈ దృశ్యాలు 2020లో వెలిమేల గ్రామంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో సంధ్యారాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించినవి. మార్చురీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తల్లిదండ్రులు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు, ఆయనను అడ్డుకునే క్రమంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయనను తన్నాడు. ఐతే విద్యార్థి తండ్రిని తన్నిన కానిస్టేబుల్‌ను అప్పుడే సస్పెండ్ చేసారు. ఈ కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ అవుతున్న వీడియో 2020లో జరిగిన ఘటనకు సంబంధించింది. ఫిబ్రవరి 2020లో పటాన్‌చెరువు సమీపంలోని వెలిమేల గ్రామంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో సంధ్యారాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వైరల్ పోస్టులో ఈ వివరాలు కూడా ప్రస్తావించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐతే అదే సమయంలో మార్చురీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తల్లిదండ్రులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకునే క్రమంలో మృతురాలి తండ్రిని ఓ పోలీస్ అధికారి బూటు కాళ్లతో తన్నాడు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ ఘటనకు సంబంధించిందే.

విద్యార్థి తండ్రిని పోలీస్ కానిస్టేబుల్ కాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ కూడా చేసారు.

ఐతే ఈ దృశ్యాలను ఇటీవల జరిగిన ఘటనలకు ఎటువంటి సంబంధం లేదు. ఐతే ఇటీవల జరిగిన పలు ఘటనల నేపథ్యంలో ఈ పాత వీడియోలను పూర్తి సమాచారం అందించకుండా ఇప్పుడు షేర్ చేయడంతో, కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ దృశ్యాలు ఇప్పుడు జరిగిన ఒక సంఘటనగా భావిస్తున్నారు.

చివరగా,  గతంలో (2020లో) ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి తండ్రి పోలీసులు తన్నిన దృశ్యాలను ఇప్పుడు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll