Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి, దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ గద్దెను ప్రజలు కూల్చేస్తున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

3 నవంబర్ 2020 న దుబ్బాకలో ఉప ఎన్నిక జరగనున్న సందర్భంలో కొంత మంది సోషల్ మీడియాలో – ‘దుబ్బాకలో టీఆరెఎస్ పార్టీ గద్దెలను పునాదులతో సహా కూల్చేస్తున్న దుబ్బాక ప్రజలు’ – అని చెప్తూ, ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాజాగా దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ గద్దెను ప్రజలు కూల్చేస్తున్న వీడియో.

ఫాక్ట్: అది ఒక పాత వీడియో. ఆ వీడియో కనీసం ఫిబ్రవరి 2019 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టిన బీజేపీ నేత శ్రీనివాస్‌ నాయక్‌ ను పోలీసులు అరెస్ట్ కూడా చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అదే వీడియోని కొందరు ఫిబ్రవరి 2019 లోనే యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ యూట్యూబ్ వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఒక వీడియో టైటిల్ లో – ‘కల్వకుర్తిలో టీఆర్ఎస్ దిమ్మెను గ్రామ‌స్తులు ఎలా కూలుస్తున్నారో చూడండి’ అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. వార్త పత్రికల ఆర్టికల్ లో కూడా పోస్ట్ చేసిన వీడియో కల్వకుర్తి కి సంబంధించింది అని రాసి ఉంది. అయితే, వీడియో ఎక్కడిదో మేము సొంతంగా నిర్ధరించలేకపోయినప్పటికీ, ఆ వీడియో తాజా దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పవొచ్చు.

దుబ్బాక ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టిన బీజేపీ నేత శ్రీనివాస్‌ నాయక్‌ పోలీసులు అరెస్ట్ కూడా చేసారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ని ఇక్కడ చూడవొచ్చు. బీజేపీ నేత అరెస్ట్ పై కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పాత వీడియో పెట్టి, దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ గద్దెను ప్రజలు ఇప్పుడు కూల్చేస్తున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll