Fake News, Telugu
 

కారు ప్రమాదంలో మరణించిన నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే కీ, పాల్గర్ ఘటనకి సంబంధంలేదు

0

ఏప్రిల్ 2020 లో పాల్గర్ కి సంబంధించిన ఘటనలో సాధువులను కొందరు గ్రామస్తులు కొట్టి చంపేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, సాధువులను హత్య చేయించిన నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే కారు ప్రమాదంలో సజీవంగా దహనమైపోయాడు అని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాల్గర్ లో సాధువులను హత్య చేయించిన నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే కారు ప్రమాదంలో మరణించాడు.

ఫాక్ట్: నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే కారు ప్రమాదంలో మరణించిన మాట వాస్తవమే, కానీ తను పాల్గర్ లో సాధువులను హత్య చేయించినట్టు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పాల్గర్  కేసులో అరెస్ట్ అయిన వారి పేర్లలో కూడా నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే పేరు లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే కారు ప్రమాదంలో మరణించినట్టు వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. కారు వైరింగ్ షార్ట్‌సర్క్యూట్ అవడంతో మంటలు మొదలై, కారులో శానిటైజర్లు ఉండడంతో మంటలు మరింత పెరిగాయని న్యూస్ ఆర్టికల్స్ లో చదవొచ్చు. కారు సెంట్రల్ లాకింగ్ సిస్టం యాక్టివేట్ అయి, తను కారులోనే ఇరుక్కుపోయి సజీవదహనం అయ్యాడు.

అయితే, తను పాల్గర్ లో సాధువులను హత్య చేయించినట్టు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇప్పటివారకు ఈ కేసులో మహారాష్ట్ర సీఐడీ ఇప్పటివరకు మూడు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది. దొంగలు తిరుతున్నారని కొన్ని పుకార్లు రావడంతో వందకు పైగా గ్రామస్తులు గూమిగూడి అటుగా వచ్చిన ముగ్గురిని దొంగలు అనుకొని కొట్టి చంపేసారని ఏప్రిల్ లో FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు. పాల్గర్  కేసులో అరెస్ట్ అయిన వారి పేర్లలో కూడా నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే పేరు లేదు. అంతేకాదు, సాధువులను చంపింది పాల్గర్ జిల్లాలో, ఎన్సీపీ నేత సంజయ్ షిండే నాసిక్ జిల్లాకి చెందినవాడు.

చివరగా, కారు ప్రమాదంలో మరణించిన నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే కీ, పాల్గర్ ఘటనకి సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll