‘టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివాసీ డాన్స్’ అంటూ కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు స్టేడియంలో డాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు చేసిన ఆదివాసీ డాన్స్ వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో టోక్యో ఒలింపిక్స్ మొదలు కాకముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. పలు వెబ్సైట్లు, యూట్యూబ్‌లో ఈ వీడియోని ఏప్రిల్ 2021లో అప్లోడ్ చేసారు. ఈ వీడియోకి ఇప్పుడు టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌కి ఎటువంటి సంబంధంలేదు. పైగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు ఆదివాసీ డాన్స్ చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో టోక్యో ఒలింపిక్స్ మొదలు కాకముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 18 ఏప్రిల్ 2021న ‘mail.naijagreen.com.ng’ అనే ఒక వెబ్సైటులో అప్లోడ్ చేసినట్టు తెలిసింది.
ఇదే వీడియో ఏప్రిల్ 2021లో యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేసి ఉంది. ఐతే ఈ వీడియో ఎక్కడిదో కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ ఈ వీడియో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న తేదీని బట్టి ఈ వీడియోకి ఇప్పుడు టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌కి ఎటువంటి సంబంధంలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.
23 జూలై 2021న టోక్యోలో ఒలింపిక్స్ మొదలవగా, ఒలింపిక్స్ ఆరంభ కార్యక్రమంలో గాని లేదా ఇతర సంధర్భంలోగాని భారత క్రీడాకారులు ఇలా ఆదివాసీ డాన్స్ చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు.
చివరగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ఆదివాసీ డాన్స్ అంటూ ఒక పాత వీడియోని షేర్ చేస్తున్నారు.