Fake News, Telugu
 

ఈ వీడియో భైంసా అల్లర్లకు సంబంధించినది కాదు

0

తాజాగా భైంసాలో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియో అని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తాజాగా భైంసాలో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియో. 

ఫాక్ట్ (నిజం): ఇదే వీడియో ఇంటర్నెట్ లో కనీసం ఫిబ్రవరి-2019 నుండి ఉంది. కావున, పోస్టులోని వీడియోకీ, తాజాగా భైంసాలో జరిగిన గొడవలకు సంబంధం లేదు. పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. అదే వీడియోని ఒకరు యూట్యూబ్ లో ఫిబ్రవరి-2019 లోనే పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. ఫేస్బుక్ లో కూడా ఆ వీడియో ఫిబ్రవరి-2019 నుండి ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు. ఆ వీడియో ఎక్కడ తీసారు అనే సమాచారం లేదు. కానీ, అది తమిళనాడు లో తీసినట్టు కొందరు పోస్ట్ చేసారు. వీడియోలోని వ్యక్తులు కూడా తమిళ్ భాషలో మాట్లాడుతున్నట్టు వినొచ్చు.

చివరగా, పోస్టులోని వీడియోకీ, తాజాగా భైంసాలో జరిగిన గొడవలకు సంబంధంలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll