Fake News, Telugu
 

ఈ వీడియోలో తన గురువుని కలుసుకున్నది IC3 సంస్థ వ్యవస్థాపకుడు గణేష్ కోహ్లి, గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ కాదు

0

చదువు చెప్పిన గురువును 26 సంవత్సరాల తర్వాత కలిసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్అం టూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 26 సంవత్సరాల తరువాత తన గురువుని కలుసుకున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ కాదు, IC3 సంస్థ వ్యవస్థాపకులు గణేష్ కోహ్లి. 27 సంవత్సరాల తరువాత తన గురువుని కలుసుకున్న సందర్బంలో, తన గురువుతో గడిపిన క్షణాలని ఇలా వీడియో రూపంలో తన వెబ్సైటులో పోస్ట్ చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియోలోని ఆ వ్యక్తిని జాగ్రత్తగా గమనిస్తే, తను గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ కాదు అని అర్ధమైంది. ఈ వీడియో మొదటి భాగంలో, ఆ వ్యక్తి పేరు గణేష్ కోహ్లి అంటూ స్క్రోల్ అవుతుండటం మనం గమనించవచ్చు. అలాగే, తన గురువు పేరు మోలీ అబ్రహం అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పాడు. ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఆ వ్యక్తి ఎవరు అని వెతకగా, పోస్టులోని అదే వీడియో IC3 సంస్థ వ్యవస్థాపకుడు గణేష్ కోహ్లి అధికారిక వెబ్సైటులో దొరికింది. ‘A tribute to Molly Teacher-By Ganesh Kohli’ అనే టైటిల్ తో ఈ వీడియోని గణేష్ కోహ్లి, తన వెబ్సైటులో పోస్ట్ చేసారు. ఈ వీడియోని IC3 సంస్థ వారు కూడా తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసారు.

IC3 సంస్థ వ్యవస్థాపకుడు గణేష్ కోహ్లి, తాను టీచర్ అవ్వడానికి ముఖ్య కారణమైన తన మాథ్స్ టీచర్ మోలీ అబ్రహంని, 27 సంవత్సరాల తరువాత కలుసుకున్న సందర్బంలో తన గురువుతో గడిపిన క్షణాలని వీడియో రూపంలో ఇలా ‘a tribute to Molly Teacher’ అంటూ పోస్ట్ చేసారు.

‘గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ తన గురువుని కలుసుకున్న వీడియో’, అంటూ సోషల్ మీడియాలో కొందరు ఈ వీడియోని షేర్ చేయగా, ఇది తనకి సంబంధించిన వీడియో అని గణేష్ కోహ్లి స్పష్టం చేస్తూ ట్వీట్ పెట్టారు. తన వీడియోని తప్పుగా గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ మరియు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకి  జత చేస్తున్నారని ఆ ట్వీట్లో తెలిపారు.

చివరగా, IC3 సంస్థ వ్యవస్థాపకులు గణేష్ కోహ్లికి సంబంధించిన పాత వీడియోని చూపిస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ తన గురువుని కలుసుకున్న వీడియో, అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll