Fake News, Telugu
 

విశాఖలో చేపలు ఒడ్డుకు కొట్టుకు వస్తున్న పాత వీడియోను షేర్ చేస్తూ ఇది మిగ్‌జాం తుఫాన్ కారణంగా జరిగిందని షేర్ చేస్తున్నారు

0

మిగ్‌జాం తుఫాన్ కారణంగా విశాఖ బీచ్‌లలో చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి అంటూ, సముద్రపు ఒడ్డుకు కొట్టుకువస్తున్న చేపల వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మిగ్‌జాం తుఫాన్ కారణంగా విశాఖ బీచ్‌లో చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో మే 2023లో విశాఖలోని భీమిలి తీరంలో అలలతో పాటు వందల సంఖ్యలో చేపలు తీరానికి కొట్టుకు వచ్చి, తిరిగి వెనక్కి వెళ్లకుండా తీరంలోనే ఉండిపోవడంతో స్థానికులు వాటిని పట్టుకుంటున్న సందర్భంలో తీసింది. ఈ ఘటన మిగ్‌జాం తుఫాన్ కారణంగా జరగలేదు. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఈ వీడియోను పలు వార్తా సంస్థలు ప్రచురించటం గమనించాం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

ఇది మే 2023లో విశాఖలోని భీమిలి తీరంలో అలలతో పాటు వందల సంఖ్యలో చేపలు తీరానికి కొట్టుకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్లకుండా తీరంలోనే ఉండిపోవడంతో స్థానికులు వాటిని పట్టుకుంటున్న సందర్భంలో తీసిన వీడియో, ఇది తుఫాను వల్ల జరగలేదు. అయితే చేపలు ఒడ్డుకు కొట్టుకు రావటం నీటిలో ఆక్సిజన్ తక్కువ అవడం వల్ల కానీ, రసాయనాలు నీటిలో కలవటం వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల సహజంగా జరుగుతుంది. అటువంటి ఘటనలు విశాఖలో పలు సందర్భాలలో చోటుచేసుకున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

దీని ద్వారా ఈ ఘటన డిసెంబర్ 2023లో చోటుచేసుకున్న మిగ్‌జాం తుఫాన్ కారణంగా జరగలేదని స్పష్టమయింది. విశాఖలో మిగ్‌జాం తుఫాన్ దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, విశాఖలో చేపలు ఒడ్డుకు కొట్టుకు వస్తున్న పాత వీడియోను షేర్ చేస్తూ ఇది మిగ్‌జాం తుఫాన్ కారణంగా జరిగిందని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll