Fake News, Telugu
 

అభివృద్ధి పనుల్లో భాగంగా తీసిన పాత వీడియోను విజయవాడలోని విజయేశ్వరాలయాన్ని కూలుస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు

0

విజయవాడలో దుర్గ గుడి దగ్గర రోడ్డు వెడల్పు చెయ్యడం కోసం మసీదుని ఏమి చెయ్యలేక శివాలయాన్ని కూలుస్తున్నారంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: విజయవాడలో దుర్గ గుడి దగ్గర రోడ్డు వెడల్పు చెయ్యడంకోసం మసీదుని ఏమి చెయ్యలేక శివాలయాన్ని కూలుస్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో పాతది; కనీసం మార్చ్ 2020 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. వీడియోలో కనిపిస్తున్నది ఇంద్రకీలాద్రి సమీపంలో ఉన్న శివాలయం, అది విజయేశ్వరాలయంగా పేరు గాంచింది. విజయేశ్వరాలయం యొక్క అభివృద్ది పనుల్లో భాగంగా ఆలయానికి ముందు ఉన్న దుకాణాలను కొంత తొలగిస్తున్నారు. అభివృద్ది పనులను ఉద్దేశపూర్వకంగా కూల్చివేతగా దుష్ప్రచారం చేస్తున్నారని దేవస్థాన అభిషేక పండితులు కృష్ణశర్మ 2020లోనే ఒక ప్రకటనలో అన్నారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.       

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో కనీసం మార్చ్ 2020 నుండి సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) బాగా షేర్ అవుతుంది. అంటే ఈ సంఘటన ఇటీవల జరిగింది కాదు.

ఇదే వీడియో 2020లో బాగా వైరల్ అయినప్పుడు, ఒక ఫేస్‌బుక్‌ యూసర్ ఈ విజువల్స్‌తో ఉన్న ఒక న్యూస్ ఆర్టికల్ యొక్క ఫోటోను పెట్టి, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దంటూ పోస్ట్ చేసాడు. ఆ ఫోటోలో, ‘విజయేశ్వరాలయానికి మహర్దశ’ (golden days, అంటే మంచి రోజులొచ్చాయని అర్థం) అనే టైటిల్‌తో ఉన్న ఆర్టికల్‌ ప్రచురించారు.

ఇంద్రకీలాద్రి సమీపంలో ఈ శివాలయం ఉంది, అయితే విజయేశ్వరాలయం అని, ఇది పేరు గాంచింది. ఆ దేవాలయాన్ని అభివృద్ది చేయడం కొరకు దేవాదాయశాఖ 1.30కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. వీడియోలో ఉన్నట్టుగా పొక్లెయిన్ తో విజయేశ్వరాలయానికి ముందు ఉన్న దుకాణాలను కొంత తొలగిస్తున్నారు. అంటే, శివాలయాన్ని కాదు, అక్కడే ఉన్న దుకాణాలను కూలుస్తున్నారు. “దేవాలయ ప్రాకారాన్ని విస్తరించడం, ఇరుకుగా ఉన్న దుకాణాల మెట్లు తొలగించి విశాలంగా నిర్మించడం, అర్చకులకు క్వార్టర్స్, ఆలయానికి అవసరమైన మండపాల నిర్మాణం చేపట్టేందుకు పనులు ప్రారంభించారు.”

ఆ ఆర్టికల్‌లోనే, చివర్లో, విజయేశ్వరాలయం రినోవేషన్ పనులను వీడియో తీసి ఆలయాన్ని కూల్చుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని దేవస్థాన అభిషేక పండితులు కృష్ణశర్మ అన్నారు. విజయేశ్వరాలయం యొక్క అభివృద్దిలో భాగంగా జరుగుతున్న పనులకు సంబంధించిన వీడియోను పుకార్లు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. అతను చేసిన ప్రకటన సాక్షి ఈ-పేపర్ లో కూడా ప్రచురించారు.

చివరగా, విజయవాడలోని విజయేశ్వరాలయం యొక్క అభివృద్ధి పనుల్లో భాగంగా తీసిన పాత వీడియోను ఆలయాన్ని కూలుస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll