“2014 జూలై 17న ఉక్రెయిన్ ఒక మలేషియా ప్యాసింజర్ విమానాన్ని కూల్చేసింది. అందులోని 275 ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు…మోడీ గారి విమానమనుకుని దాన్ని కూల్చేశారు…”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2014లో ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేయాలని చూసిన ఉక్రెయిన్.
ఫాక్ట్: ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని ఉక్రెయిన్ కూల్చేయాలని చూసినట్టు ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. ప్రధాని విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని, అవి ఊహాగానాలే అని అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు 2014లోనే తెలిపారు. అంతేకాదు, రష్యాకి సంబంధించిన మిస్సైల్ ఉపయోగించి రష్యా ప్రభావం మరియు మద్దతు ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో MH17 విమానాన్ని కూల్చేసినట్టు ‘డచ్ సేఫ్టీ బోర్డ్’ వారి విచారణలో తెలిసింది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని ఉక్రెయిన్ కూల్చేయాలని చూసినట్టు ఎక్కడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ప్రధాని విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని, అవి ఊహాగానాలే అని అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు 2014లోనే తెలిపినట్టు ఇక్కడ చదవచ్చు. మలేషియా విమానం (MH17) ఘటనపై అశోక్ గజపతి రాజు చేసిన ఇతర వ్యాఖ్యలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.
అంతేకాదు, రష్యాకి సంబంధించిన మిస్సైల్ ఉపయోగించి రష్యా ప్రభావం మరియు మద్దతు ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో MH17 విమానాన్ని కూల్చేసినట్టు ‘డచ్ సేఫ్టీ బోర్డ్’ వారి విచారణలో తెలిసింది. తాజాగా నెదర్లాండ్స్ మరియు ఆస్ట్రేలియా అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ కు (ఐసీఏఓ) రష్యాపై ఫిర్యాదు చేసాయి. అయితే, రష్యా మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది.
అంతేకాదు, పోస్ట్‌లో చెప్పినట్టు నలుగురు అరెస్ట్ అవలేదు. వారిని కేవలం MH17 కేసులో నిందితులుగా గుర్తించారు. ఈ కేసుపై ‘బీబీసీ’ వారితో ఇగోర్ గిర్కిన్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ వినవచ్చు.
చివరగా, 2014లో ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని ఉక్రెయిన్ కూల్చేయాలని చూసినట్టు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.