Fake News, Telugu
 

పాత వీడియోని ప్రస్తుతం హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

పెద్ద సంఖ్యలో సాధువులు ఒకే చోట ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు జరుగుతున్న కుంభమేళకి సంబంధించిందని అర్ధం వచ్చేలా షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇప్పుడు జరుగుతున్న కుంభమేళలో పెద్ద సంఖ్యలో సాధువులు ఒకే చోట ఉన్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2019 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకి పెద్ద సంఖ్యలో సాధువులు పాల్గొన్నప్పటికీ, ఈ వీడియో ఇప్పుడు హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకి  సంబంధించింది కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 2019లో షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి. ఇదే వీడియోని 11 మార్చ్ 2019లో ‘కుంభమేళ నాగా సాదు’ అనే టైటిల్ తో షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ ఇక్కడ చూడొచ్చు.

ఇదే వీడియో 10 మార్చ్ 2019న  కుంభమేళ కి సంబంధించిన టైటిల్ తో యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయబడింది.

2019లో 15 జనవరి నుండి 04 మార్చ్ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళ జరిగింది, ఐతే ఈ వీడియో 2019లో జరిగిన కుంభమేళకి సంబంధించిందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు దొరకనప్పటికి ఈ వీడియో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ వీడియో ఇప్పుడు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకి ఎక్కువ సంఖ్యలో సాధువులు పాల్గొన్నప్పటికీ, ఈ వీడియో ఇప్పుడు జరుగుతున్న కుంభమేళకి సంబంధించింది కాదు. హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకి  సంబంధించిన కొన్ని ఫోటోలు ఇక్కడ చూడవొచ్చు.

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, పాత వీడియోని ప్రస్తుతం హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll