‘ఒక పక్క కరోనా, మరో వైపు మిడతల దాడి భయం…!!ఈ లోపు సౌదీ లోనిన్న కాకుల కలకలం’ అంటూ ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సౌదీ అరేబియాలో తాజాగా కాకుల కలకలం చేసిన వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన టెక్సాస్ (అమెరికా) లోని ఒక సూపర్ మార్కెట్ పార్కింగ్ లాట్ లో జరిగింది. ఆ వీడియో 2016 లో తీసినట్టుగా తెలిసింది. కావున పోస్టు లో చెప్పింది తప్పు.
పోస్టు లోని వీడియో గురించి యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, అదే వీడియో ని ‘Viral Hog’ అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ‘17 ఏప్రిల్ 2020’ న అప్లోడ్ చేసినట్లుగా తెలిసింది. ఆ వీడియో గురించి ఉన్న వివరణలో, అందులోని ఘటన కారోల్టన్, టెక్సాస్ (అమెరికా) లోని ‘H-Mart’ పార్కింగ్ లాట్ లో డిసెంబర్ 2016 లో జరిగిందని ఉంది. దాంతో, ‘H-Mart కారోల్టన్, టెక్సాస్’ అని వెతికి, ఆ మార్ట్ యొక్క స్ట్రీట్ వ్యూ చూసినప్పుడు, వీడియో లో ఉన్నది టెక్సాస్ లోని మార్ట్ అనే తేలింది.

చివరిగా, సూపర్ మార్కెట్ వెలుపల పక్షుల సమూహం ఉన్న వీడియో పాతది మరియు దానిని టెక్సాస్ (అమెరికా) లో చిత్రీకరించారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?