Fake News, Telugu
 

పాత ఫోటోలను పోస్టు చేసి, ‘ఇటీవల ఒడిశా లో బిచ్చగాళ్ళ వేషం లో పట్టుబడ్డ అవయవ సరఫరా ముఠా ఫోటోలు’ అని ప్రచారం చేస్తున్నారు

0

ఒరిస్సా నుంచి ఈ రోజు అందిన సమాచారం ఏమిటంటే బీహార్ నుంచి జార్ఖండ్ మధ్యలో బిచ్చగళ్ళ వేషంలో ఒక 500 వందల మంది బయలుదేరారు. మార్గమధ్యంలో ఒంటరిగా దొరికిన వాళ్ళను చంపి మెడికల్ కాలేజీలకు, మరియు కిడ్నీల దందా లకు సరఫరా చేస్తున్నారు. వీరిలో 6,7 మంది పట్టు బడినారు ఆ 6,7 మందిని విచారిస్తే వారు మేము కాక ఇంకా 500 వందల మంది ఉన్నాం అని ఒప్పుకున్నారు. అందుకే బ్రదర్స్ ఎంత వీలైతే అంత మందికి ఈ మెసేజ్ ని మీ మీ మిత్రులకు వాట్సాప్ ఇతరత్రా ద్వారా చేరవేయగలరు’ అని చెప్తూ కొన్ని ఫోటోలను ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల ఒడిశా లో బిచ్చగాళ్ళ వేషం లో పట్టుబడ్డ అవయవ సరఫరా ముఠా ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోలు పాతవి, అవి చాలా సంవత్సరాలుగా ఇంటర్నెట్ లో ఉన్నాయి. రెండు ఫోటోలు మధ్య ప్రదేశ్ లో ఆగస్ట్ 2019 లో జరిగిన ఒక ఘటనవి. మూడవ ఫోటో గుజరాత్ కి సంబంధించింది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఫోటో 1 & 2:

ఫోటోలు గత సంవత్సరం (2019) ఆగష్టు లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక ఘటన వి. గ్వాలియర్ లో కొంతమంది వ్యక్తులను పిల్లల కిడ్నాపర్లనే ఆరోపణతో అక్కడి జనం కొట్టడంతో స్థానిక పోలీసులు ఆ వ్యక్తులను తీసుకువెళ్తున్నారు. కావున ఫోటోలు మధ్య ప్రదేశ్ లో ఆగస్ట్ 2019 లో జరిగిన ఘటనవి.

ఫోటో 3:

ఫోటో 2016 లో గుజరాత్ లో జరిగిన ఒక ఘటన ది. రాజ్ కోట్ లోని ఒక హోటల్ లో పోలీసులు అక్రమాయుధాలు పట్టుకుని ఆ హోటల్ వారిని అరెస్ట్ చేశారు. ఆ ఘటనకి సంబంధించి ఇతర వార్తా పత్రికలు ప్రచురించిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కావున ఫోటో గుజరాత్ రాష్ట్రం లో మార్చ్ 2016 లో జరిగిన ఘటనది.

చివరగా, పాత ఫోటోలను పోస్టు చేసి, ‘ఇటీవల ఒడిశా లో బిచ్చగాళ్ళ వేషం లో పట్టుబడ్డ అవయవ సరఫరా ముఠా ఫోటోలు’ అని ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll