Fake News, Telugu
 

పాత ఊరేగింపు వీడియోని బెంగాల్ లో ఈ మధ్య కాలంలో జరిగిందంటూ షేర్ చేస్తున్నారు

0

కొందరు వ్యక్తులు చేతుల్లో కత్తులు, కర్రలతో ఊరేగింపు చేసిన వీడియోని షేర్ చేస్తూ, ఈ ఊరేగింపు ఇప్పుడు బెంగాల్ లో జరిగినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఈ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల బెంగాల్ లో కొందరు వ్యక్తులు చేతుల్లో కత్తులు మరియు కర్రలతో ఊరేగింపు చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2017 నుండే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. దీన్నిబట్టి ఈ వీడియో ఈ మధ్య కాలంలో బెంగాల్ లో జరిగిన ఊరేగింపుకి సంబంధించింది కాదని స్పష్టంగా అర్ధమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ చేయగా ఇదే వీడియో 2017 నుండే యూట్యూబ్ లో అందుబాటులో ఉందని తెలిసింది. 01 అక్టోబర్ 2017న  ముహమ్మద్ అహ్ఫాజ్ అనే యూట్యూబ్ ఛానల్ లో ‘Muharram in 2017 Labbyk Ya Hussain’ అనే టైటిల్ తో ఇదే వీడియో అప్లోడ్ చేయబడి ఉంది.

2018లో కూడా ఇదే వీడియోని ‘Sarangpur mohram 2018’ అనే టైటిల్ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు.

యూట్యూబ్ లో ఈ వీడియో మొహ్రామ్ కి సంబంధించిందంటూ అప్లోడ్ చేసినప్పటికీ, మాకు ఈ వీడియో ఎప్పుడు, ఏ సందర్భంలో తీశారో కచ్చితమైన సమాచారం తెలియలేదు. ఐతే యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న తేదీ బట్టి ఈ వీడియో ఈ మధ్య కాలంలో జరిగిన  ఊరేగింపుకి సంబంధించింది కాదని స్పష్టంగా అర్ధం అవుతుంది.

చివరగా, పాత ఊరేగింపు వీడియోని బెంగాల్ లో ఈ మధ్య కాలంలో జరిగిందంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll