Fake News, Telugu
 

సోనియా గాంధీ మరియు మాల్దీవ్స్ దేశ మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ యొక్క పాత ఫోటోషాప్ చేసిన ఫోటోని మళ్ళీ షేర్ చేస్తున్నారు.

0

మాల్దీవ్స్ దేశ మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూర్చున్నట్లుగా ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో విస్తారంగా షేర్ చేస్తున్నారు. కానీ, FACTLY విశ్లేషణ లో ఆ ఫోటో ఫోటోషాప్ చేసినదని తేలింది. ఒరిజినల్ ఫోటో లో ఇద్దరు నాయకులు వేరువేరు కుర్చీల్లో కూర్చుని ఉంటారు. ఆ ఫోటో 2015 లో అప్పుడు మాల్దీవ్స్ దేశానికి  అధ్యక్షుడిగా ఉన్న మౌమూన్ అబ్దుల్ గయూమ్ తన భారత్ పర్యటనలో భాగంగా సోనియా గాంధీ ని కలిసినప్పుడు తీసినది. గతం సంవత్సరం కూడా ఇదే ఫోటో సోషల్ మీడియా లో చలామణీ అయినప్పుడు, FACTLY రాసిన కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.  

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. ఒరిజినల్ ఫోటో – https://www.gettyimages.in/detail/news-photo/president-of-the-republic-of-maldives-maumoon-abdul-gayoom-news-photo/52489969

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll