Fake News, Telugu
 

పాత ఫోటోని ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆధునిక ఆరోగ్య సేవలతో ప్రారంభించిన ‘108’ అంబులెన్స్ వాహనంలో కాన్పు జరిగిన ఫోటో’ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘108’ వాహనాల్లో అన్ని సౌకర్యాలు పెట్టటం వలన హాస్పిటల్ కి వెళ్లకుండా అంబులెన్సు లోనే ప్రసవించిన తల్లి అని దాని గురించి చెప్తున్నారు. ‘108’ అనేది ఉచిత అత్యవసర టెలిఫోన్ నంబర్ సేవ. దానిని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2005 లో ప్రారంభించారు. అయితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ‘1 జులై 2020’ న ఆధునిక లైఫ్ సపోర్ట్ వ్యవస్థలతో కూడిన మరో 412 కొత్త ‘108’ అంబులెన్స్ లను ప్రారంభించింది. వాటిలో నియో-నాటల్ అంబులెన్సులు కూడా ఉన్నాయి. పోస్టులోని ఫోటోని ఈ సందర్భంగా షేర్ చేస్తున్నారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘1 జులై 2020’ న ఆధునిక ఆరోగ్య సేవలతో ప్రారంభించిన ‘108’ అంబులెన్స్ లో కాన్పు జరిగిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటో పాతది. అది కనీసం ‘మార్చ్ 2017’ నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్లుగా తెలిసింది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ‘1 జులై 2020’ న ఆధునిక లైఫ్ సపోర్ట్ వ్యవస్థలతో కూడిన మరో 412 కొత్త ‘108’ అంబులెన్స్ లను ప్రారంభించింది. వాటిలో 26 నియో-నాటల్ అంబులెన్సులు కూడా ఉన్నాయి.

పోస్టులోని ఫోటోని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ పద్దతి ద్వారా వెతకినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ‘టైం ఫిల్టర్’ పెట్టి వెతికినప్పుడు, ఆ ఫోటోని మొదటగా మలయాళం నటి చించు మోహన్ ‘మార్చ్ 2017’ లో తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్టు చేసినట్లుగా తెలిసింది. ఆమె ఆ ఫోటో ని ‘7 గంటల పాటు ఆపరేషన్ చేసి చావుబతుకుల్లో ఉన్న తల్లిని మరియు బిడ్డను రక్షించిన డాక్టర్’ అనే వివరణతో పోస్టు చేసింది. కానీ, FACTLY కి ఆ ఫోటో గురించి మరేయితర సమాచారం లభించలేదు. అయితే ఆ ఫోటో కనీసం మూడు సంవత్సరాలు పాతది కాబట్టి, దానికి మరియు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త ‘108’ అంబులెన్స్ లకు సంబంధం లేదు.

చివరగా, పాత ఫోటోని పోస్టు చేసి ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆధునిక ఆరోగ్య సేవలతో ప్రారంభించిన ‘108’ అంబులెన్స్ లో కాన్పు జరిగిన ఫోటో’ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll