Fake News, Telugu
 

నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగా ఒక ఆఫీసర్ తో దిగిన ఫోటోని చూపించి, తన కూతురితో దిగిన ఫోటో అంటూ షేర్ చేస్తున్నారు.

0

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మిలిటరీలో ఆఫీసర్ గా పనిచేస్తున్న తన కూతురుతో దిగిన ఫోటో, అంటూ కొందరు ఒక ఫోటో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మిలిటరీలో పనిచేస్తున్న తన కూతురితో దిగిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో చెప్పినట్టు నిర్మలా సీతారామన్ తో కలిసి ఫొటోలో ఉన్న ఆ మిలిటరీ ఆఫీసర్ తన కూతురు కాదు. రక్షణ మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ కోరిక మేరకు నిర్మలా సీతారామన్ తనతో ఈ ఫోటో దిగినట్టు మా విశ్లేషణలో తెలిసింది. నిర్మలా సీతారామన్ కూతురు పరకాల వాంగ్మయి ఒక నేషనల్ న్యూస్ ఛానల్ లో సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తుంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోకి సంబంధించిన  వివరాల కోసం వెతకగా, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ ఫోటో కి సంబంధించి  పెట్టిన ట్వీట్ దొరికింది. నిర్మలా సితారామన్ తో కలిసి ఫోటో దిగిన ఆ మిలిటరీ ఆఫీసర్ తన కూతురు కాదు అని స్పష్టంచేస్తూ ఆ ట్వీట్ పెట్టారు. రక్షణ మంత్రి పదవిలో ఉన్నప్పుడు చేసిన పర్యటనలో ఒక ఆఫీసర్ కోరిక మేరకు నిర్మలా సితారామన్ ఈ ఫోటో తనతో దిగినట్టు విశ్లేషణలో తెలిసింది.

నిర్మలా సీతారామన్ కూతురు పరకాల వాంగ్మయి కి సంబందించిన వివరాల కోసం వెతకగా, ‘Times Now’ వారు తన గురించి రాసిన ఒక ఆర్టికల్ దొరికింది. ఆ ఆర్టికల్ లో వాంగ్మయి ఒక నేషనల్ న్యూస్ ఛానల్లో సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నట్టు రాసి ఉంది. వంగ్మయి ఫోటోలు మనం ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. గూగుల్ లో దొరికిన వాంగ్మయి ఫోటోని, పోస్టులో షేర్ చేస్తున్న ఫోటోతో పోలిక చూడగా, పోస్టులో చెబుతున్నట్టు ఆ ఆఫీసర్ కేంద్ర మంత్రి నిర్మలా సితరామన్ కూతురు కాదు అని ఖచ్చితంగా  చెప్పవచ్చు.

చివరగా, నిర్మలా సీతారామన్  రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ కోరిక మేరకు దిగిన ఫోటోని చూపించి, తన కూతురితో దిగిన ఫోటో అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll