Fake News, Telugu
 

ఈ ఫోటో బీహార్ కి సంబంధించిన ఒక రోడ్డు పాత ఫోటో

0

గుంటలతో నిండి ఉన్న ఒక రోడ్డు యొక్క ఫోటోని పెట్టి, ‘జగనన్న ప్రభుత్వం కేటాయించిన ఇంటింటికి స్విమ్మింగ్ పూల్ పథకం’ అని వ్యంగ్యంగా అది ఆంధ్రప్రదేశ్ కి చెందిన రోడ్డు అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలు పడి ఉన్న ఒక రోడ్డు ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో బీహార్ రాష్ట్రం లోని ‘భాగల్పూర్ – పిర్ పైంటి’ ప్రాంతాల మధ్య ఉన్న NH-80 రోడ్డుకి సంబంధించిన పాత ఫోటో. ఫోటోలోని రోడ్డుకీ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటో ని ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వార్తా సంస్థ బీహార్ లోని భాగల్పూర్ ప్రాంతంలో ఉన్న రోడ్ల దుఃస్థితిని వివరిస్తూ 2017 లో రాసిన ఒక కథనం లో చూడవచ్చు.

అయితే, 2017 లో ఇదే ఫోటో బీహార్ రోడ్డు ఫోటో అని వైరల్ అవ్వగా, అది ఒక పాత ఫోటో అని, ఆ రోడ్డు అసలు ఎలా ఉందో చూడండి అంటూ, మరొక ఫోటోని అప్పటి బీహార్ రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన తేజస్వి యాదవ్ ట్వీట్ చేసారు. ‘ఏబీపీ’ ఛానల్ వారు కూడా ఫోటోలో ఉన్న ప్రదేశానికి వెళ్లి, ఫోటోలో ఉన్న రోడ్డు పరిస్థితి పాతదని, కొత్తగా రోడ్డు వేయబడిందని 2017 లోనే రిపోర్ట్ చేసారు.

అంతేకాదు, పోస్ట్ లోని ఫోటో ఇంతకముండు పలుసార్లు వివిధ రాష్ట్రాలకి సంబంధించిన ఫోటోగా వైరల్ అయినప్పుడు FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్ ని కింద చూడవొచ్చు.

తెలంగాణ:

కేరళ: (రాహుల్ గాంధీ వయనాడ్ నియోజికవర్గం)

ఉత్తరప్రదేశ్:

చివరగా, ఫోటోలోని రోడ్డుకీ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేదు. అది బీహార్ కి సంబంధించిన ఒక రోడ్డు యొక్క పాత ఫోటో.

Share.

About Author

Comments are closed.

scroll