Fake News, Telugu
 

బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఫోటో పెట్టి, తెలంగాణ రాష్ట్రంలోని రోడ్లు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

1

రోడ్డు పై నీటితో నిండిన గుంతల ఫోటో ఒకటి ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది తెలంగాణ రాష్ట్రం లోని ఒక రోడ్డుకి సంబంధించినదని చాలా మంది షేర్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : ఫోటో తెలంగాణ రాష్ట్రం లోని ఒక రోడ్డు కి సంబంధించినదని. 

ఫాక్ట్ (నిజం): ఫోటో బీహార్ రాష్ట్రం లోని ‘భాఘల్పూర్- పిర్ పైంటి’ ప్రాంతాల మధ్య ఉన్న NH-80 రోడ్డుది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

పోస్టులో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సెర్చ్ రెజల్ట్ లో ఒక ట్విట్టర్ వినియోగదారుడు ‘భాఘల్పూర్- పిర్ పైంటి’ ప్రాంతాల మధ్య ఉన్న NH80 రోడ్డు ఫోటోలు అంటూ ట్వీట్ లో ఆ ఫోటోని పెట్టాడు.

అదే ఫోటో ని ‘Times of India’ వార్తా సంస్థ భాఘల్పూర్ ప్రాంతంలో ఉన్న రోడ్ల దుఃస్థితిని వివరిస్తూ 2017 లో రాసిన కథనం లో కూడా చూడవచ్చు.

చివరగా, ఆ ఫోటో తెలంగాణ రాష్ట్రంలోని రోడ్డుకి సంబంధించినది కాదు. అందులో ఉన్నది బీహార్ రాష్ట్రం లోని భాఘల్పూర్ ప్రాంతంలోని ఒక రోడ్డు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll