ఇటీవల తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని దేవాలయాలలో అన్ని కులాలకు చెందిన వ్యక్తులని అర్హులను చేస్తూ ఆదేశాలు జారీ చేసి, పలువురు ఇతర కులాలకు చెందిన వారిని అర్చకులుగా నియమించింది. ఐతే ఈ నేపథ్యంలోనే ఒక అర్చకుడు దేవుడి విగ్రహాంపై కాలు పెట్టిన ఫోటోని తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలకి ముడిపెడుతూ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: తమిళనాడులో ఇటీవల అర్చకుడు దేవుడి విగ్రహాంపై కాలు పెట్టిన ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఇది పాత ఫోటో, ఈ ఫోటో ఫిబ్రవరి 2020 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ఐతే ఈ ఫోటోలోని ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ, ఈ ఫోటో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న తేదీని బట్టి ఈ ఫోటోకి ఇటీవల తమిళనాడు ప్రభుత్వం అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి అర్హులను చేస్తూ జారీ చేసిన ఆదేశాలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇది పాత ఫోటో, ఈ ఫోటోకి ఇటీవల అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి అర్హులను చేస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు ఎటువంటి సంబంధంలేదు. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని 2020లో షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులు అనేకం మాకు కనిపించాయి. ఈ పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐతే ఈ ఫోటోలోని ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో కచ్చితమైన సమాచారం మాకు తెలియనప్పటికీ, ఈ ఫోటో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న తేదీని బట్టి ఈ ఫోటోకి ఇటీవల తమిళనాడు ప్రభుత్వం అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి అర్హులను చేస్తూ జారీ చేసిన ఆదేశాలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ఫోటో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమయానికి ఈ ఆదేశాలు అమలు కాలేదు, పైగా డిఎంకె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.
చివరగా, పాత ఫోటోని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి అర్హులను చేస్తూ జారీ చేసిన ఆదేశాలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.