‘ఇక్కడ ఉన్న ముస్లిం నచ్చడు, కానీ వేరే దేశపు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం’ అని వ్యంగ్యగా రాస్తూ, సౌదీ అరేబియా రాజు కాళ్ళను మోడీ పట్టుకుంటున్నట్టు ఉన్న ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: సౌదీ అరేబియా రాజు కాళ్ళు పట్టుకుంటున్న మోడీ ఫోటో.
ఫాక్ట్ (నిజం): అది ఒక ఎడిటెడ్ ఫోటో. 2013 లో అద్వానీ పాదాలకు మోడీ నమస్కరిస్తున్న ఫోటోని తీసుకొని, అద్వానీ స్థానంలో సౌదీ రాజును పెట్టారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టు చేసిన ఫోటోని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటో పై వార్తాపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. 2013 లో అద్వానీ పాదాలకు మోడీ నమస్కరిస్తున్న ఫోటోని తీసుకొని, అద్వానీ స్థానంలో సౌదీ రాజును పెట్టినట్టు ‘Business Standard’ ఆర్టికల్ లో చదవొచ్చు. ఇదే ఎడిటెడ్ ఫోటో 2016 లో కూడా వైరల్ అయింది. ఒరిజినల్ ఫోటోని ‘The Telegraph’ ఆర్టికల్ లో కూడా చూడవొచ్చు.
చివరగా, పాత ఎడిటెడ్ ఫోటో పెట్టి, ‘సౌదీ అరేబియా రాజు కాళ్ళు పట్టుకుంటున్న మోడీ’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Its fact this is true i am sorry to share like this.