కరోనావైరస్ సంక్షోభం కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ వలన భాధ పడుతున్న పేదలు అని క్లెయిమ్ చేస్తూ ఒక ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోను అదే క్లెయిమ్ తో ‘DalitCongress’ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో కూడా ట్వీట్ చేసింది. కానీ, FACTLY విశ్లేషణలో ఆ ఫోటో లాక్ డౌన్ కి, భారత దేశం కి సంబంధం లేదని, బంగ్లాదేశ్ లో తీసిన ఫోటో అని తెలిసింది. ఫోటోలో ఉన్న అదే మనిషిని ‘UKnews.com’ వారు 2017లో పోస్ట్ చేసిన ఒక వీడియో లో చూడవచ్చు. ఆ వీడియో గురించి ఇచ్చిన వివరణలో, వాళ్ళు బంగ్లాదేశ్ కి వచ్చిన రోహింగ్యాలు అని ఉంది. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ వలన వలస కూలీలకు సమస్యలు ఉన్నది నిజమే, కానీ, పోస్ట్ లోని ఫోటో భారత్ లో తీసింది కాదు.
సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ –
1. న్యూస్ ఆర్టికల్ – https://www.pressenza.com/2017/11/rohingya-refugees-coxs-bazar-bangladesh/
2. ఫేస్ బుక్ వీడియో – https://www.facebook.com/watch/?v=1624412180923619
3. ట్విట్టర్ వీడియో –https://twitter.com/aziznur1989/status/906079861747404800
Did you watch our new video?