Fake News, Telugu
 

భారత్ ను ఎదురుకోవడానికి కెనడా నుండి ట్రైనింగ్ తీసుకుంటున్న చైనా అని షేర్ చేస్తున్న ఫోటోలు పాతవి

0

భారత సైనికులను ఎదురుకోవడానికి కెనడా నుండి ట్రైనింగ్ ఆఫీసర్లను పిలిపించుకొని తమ సైనికులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్న చైనా అని చెప్తూ, దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత సైనికులను ఎదురుకోవడానికి కెనడా నుండి ట్రైనింగ్ ఆఫీసర్లను పిలిపించుకొని తమ సైనికులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్న చైనా.

ఫాక్ట్ (నిజం): ఇందులో ఒక ఫోటో NATO బలగాలలో భాగమైన కెనడా సైనికులు 2014లో కెనడా వైపుగల ఆర్కిటిక్ తీరంలో ట్రైనింగ్ తీసుకుంటున్నది కాగా మరొకటి 2018లో కెనడా మరియు చైనా ఆర్మీ మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్‌సైజ్ కి సంబంధించింది. ఇటీవల కాలంలో కెనడా మరియు చైనా ఆర్మీ మధ్య ఎటువంటి మిలిటరీ ఎక్సర్‌సైజ్స్ జరగలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఫోటో 1:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా NATO (North Atlantic Treaty Organization) బలగాలలో కెనడా యొక్క ప్రతినిధి బృందానికి చెందిన అధికారిక ట్విట్టర్ ఎకౌంటులో ఇదే ఫోటోని షేర్ చేసిన 2014 ట్వీట్ మాకు కనిపించింది. ఈ ట్వీట్ ప్రకారం ఈ ఫోటో ఫిబ్రవరి 2014లో కెనడా వైపుగల ఆర్కిటిక్ తీరంలో కెనడా సైనికులు ట్రైనింగ్ తీసుకుంటున్న సందర్భంలో తీసింది.

ఫోటో 2:  

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోని కెనడా ఆర్మీ యొక్క అధికారిక ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ఫిబ్రవరి 2018లో షేర్ చేసిన ఒక ట్వీట్ మాకు కనిపించింది. ఈ ట్వీట్ ప్రకారం ఈ ఫోటో చైనా మరియు కెనడా ఆర్మీ మధ్యలో జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ కి సంబంధించింది.

ఫోటో 3:

ఈ ఫోటోకి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.

ఇటీవల కాలంలో కెనడా మరియు చైనా ఆర్మీ మధ్య మిలిటరీ ఎక్సర్‌సైజ్స్ జరిగినట్టు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక అధికారిక సమాచారం మాకు లభించలేదు. పైగా ఇటీవల కెనడా జాతీయ రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ పార్లమెంట్ లో కెనడా ఇకపై చైనా మిలిటరీతో శిక్షణ పొందడం లేదని’  చెప్పారు. వీటన్నిటి ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలు ఇటీవల కాలంలో కెనడా మరియు చైనా ఆర్మీ మధ్య మిలిటరీ ఎక్సర్‌సైజ్స్ కి సంబంధించినవి కావని కచ్చితంగా చెప్పొచ్చు.

రెండు దేశాల ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్సు మధ్యలో ఎక్సర్‌సైజ్స్ అనేవి చాలా సాధారణం. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం, సైనికులకు గ్లోబల్ ఎక్స్పోజర్ వంటి కారణాల వల్ల ఈ ఇవి నిర్వహిస్తుంటారు. భారత దేశం కూడా చాలా దేశాల ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్సుతో సంయుక్తంగా ఎక్సర్‌సైజ్స్ నిర్వహిస్తుంటుంది. ఉదాహరణకి, భారత ఆర్మీ నేపాల్ ఆర్మీ తో కలిసి ‘సూర్య కిరణ్‘, ఫ్రాన్స్ ఆర్మీతో ‘శక్తీ’, అమెరికన్ ఆర్మీతో  ‘యుద్ అభ్యాస్’, చైనా ఆర్మీతో ‘హ్యాండ్ ఇన్ హ్యాండ్’ పేర్లతో ఎక్సర్‌సైజ్స్ నిర్వహిస్తుంటాయి. భారత దేశ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్సు వివిధ దేశాల ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్సుతో నిర్వహించే ఎక్సర్‌సైజ్స్ కి సంబంధించిన వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. అమెరికన్ ఆర్మీ వివిధ దేశాల ఆర్మీతో కలిసి నిర్వహించే ఎక్సర్‌సైజ్స్ కి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఇవి పాత ఫోటోలు, ఇటీవల కాలంలో కెనడా మరియు చైనా ఆర్మీ మధ్య మిలిటరీ ఎక్సర్‌సైజ్స్ జరగలేదు.

Share.

About Author

Comments are closed.

scroll