Fake News, Telugu
 

సంబంధంలేని పాత ఫోటోలను పెట్టి, షహీన్ బాగ్ కి సంబంధించిన ఫొటోలుగా షేర్ చేస్తున్నారు

0

షహీన్ బాగ్ ఆందోళనకారులల్లో 1300 మంది గర్భవతులయినట్లుగా చెప్తూ, అక్కడ గుట్టలు గుట్టలుగా కండోమ్స్ దొరికాయని ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. ఆ పోస్టులో అదే విషయంతో ఉన్న ఒక కథనం యొక్క స్క్రీన్ షాట్ ని కూడా పెడుతున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: షహీన్ బాగ్ ఆందోళనకారులల్లో 1300 మంది గర్భవతులయ్యారు. అక్కడ గుట్టలు గుట్టలుగా కండోమ్స్ దొరికాయి. 

ఫాక్ట్ (నిజం): షహీన్ బాగ్ వద్ద మహిళలు CAA కి వ్యతిరేకంగా ‘15 డిసెంబర్ 2019’ నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ, షహీన్ బాగ్ ఆందోళనకారులల్లో 1300 మంది గర్భవతులయినట్లుగా ఎక్కడా సమాచారం లేదు. కండోమ్స్ ఉన్న ఫోటో పాతది. అది ఇంటర్నెట్ లో కనీసం 2016 నుండి ఉంది. దానికి షహీన్ బాగ్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు వ్యతిరేకంగా మహిళలు షహీన్ బాగ్ వద్ద ‘15 డిసెంబర్ 2019’ నుండి నిరసనలు తెలుపుతున్నట్లు ‘Indian Express’ కథనం ద్వారా తెలుసుకోవచ్చు.

పోస్టులోని స్క్రీన్ షాట్ లో ఉన్న సమాచారం ఆధారంగా గూగుల్ లో వెతికినప్పుడు, ఆ న్యూస్ రిపోర్ట్ లభించింది. ఆ కథనం లో షహీన్ బాగ్ ఆందోళనకారులల్లో 1300 మంది గర్భవంతులయినట్లు మరియు అక్కడ గుట్టలు గుట్టలుగా కండోమ్స్ దొరికాయని ఉంది. కానీ, ఆ కథనం చివరిలో ఒక ‘నోట్’ లో, దానిని కేవలం సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఆధారంగా రాశామనీ, దాని వాస్తవికత గురుంచి తెలియదని పేర్కొన్నారు.

గూగుల్ లో వెతికినప్పుడు, షహీన్ బాగ్ ఆందోళనకారులల్లో 1300 మంది గర్భవంతులయినట్లుగా సమాచారం ఎక్కడా లభించలేదు. స్క్రీన్ షాట్ లో కండోమ్స్ ఉన్న ఫోటోని క్రాప్ చేసి వెతికినప్పుడు, ఆ ఇమేజ్ ఇంటర్నెట్ లో కనీసం 2016 నుండి ఉన్నట్లుగా తెలిసింది. దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారం ఏమీ లభించినప్పటికీ, అది షహీన్ బాగ్ లో నిరసనలు ప్రారంభం అవ్వడానికంటే ముందు నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్లుగా తెలిసింది. కావున, దానికీ, ఆ నిరసనలకీ ఎటువంటి సంబంధం లేదు.

స్క్రీన్ షాట్ లో గర్భవతులు ఉన్న ఫోటోని క్రాప్ చేసి వెతికినప్పుడు, ‘The Print’ వార్తా సంస్థ ‘23 సెప్టెంబర్ 2019’ న ఢిల్లీ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘మహిళ’ వార్డుల దుఃస్థితి గురించి రాసిన కథనం లో లభించింది. కావున, ఆ ఫోటో కూడా షహీన్ బాగ్ నిరసనలకి సంబంధించినది కాదు.   

చివరగా, పాత ఫోటోలను పెట్టి ‘షహీన్ బాగ్ ఆందోళనకారులల్లో 1300 మంది గర్భవతులయ్యారు మరియు అక్కడ గుట్టలు గుట్టలు గా కండోమ్స్ దొరికాయి’ అని తప్పుడు ఆరోపణతో షేర్ చేస్తున్నారు. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll