Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

సెనెగల్ విమానాశ్రయంలో జరిగిన ‘మాక్ డ్రిల్’ వీడియో పెట్టి, ‘కొరోనా కారణంగా ఇటలీ పరిస్థితి’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

1

ఒక ఎయిర్ పోర్ట్ రన్ వే దగ్గర అనారోగ్యం తో ఉన్న కొంతమంది ప్రయాణికులను అక్కడి సిబ్బంది రెస్క్యూ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది ప్రస్తుతం ఇటలీ లో నెలకొన్న పరిస్థితులదని చెప్తున్నారు. ఆ పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొరోనా వైరస్ వల్ల ఇటలీ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో నవంబర్ 2019 లో బ్లేజ్ డయాగ్నే అంతర్జాతీయ విమానాశ్రయం (సెనెగల్) లో జరిగిన ఒక ‘మాక్ డ్రిల్’ కి సంబంధించినది. ఆ డ్రిల్ ని విమానాశ్రయం లో అత్యవసర పరిస్థితులు ఏర్పడినపుడు అక్కడి సిబ్బంది దానిని ఎంత సమర్ధవంతంగా ఎదురుకుంటారో నిర్ధారించడానికి నిర్వహించారు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

వీడియో లో ఉన్న విమానం మీద సెనెగల్ (Senegal) అని ఉండడం చూడవచ్చు. అది, ఆ విమానం సెనెగల్ దేశానికి చెందినదని సూచిస్తోంది.

యూట్యూబ్ లో ‘Senegal airplane rescue’ అనే పదాలతో వెతికినప్పుడు, పోస్టు లోని వీడియో లో ఉన్న విజువల్స్ మరియు అదే లోగో తో ఉన్న వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. ‘Dakaractu Tv’ కి సంబంధించిన ఆ వీడియో ని చూసినప్పుడు, అది నవంబర్ 2019 లో సెనెగల్ దేశంలోని బ్లేజ్ డయాగ్నే అంతర్జాతీయ విమానాశ్రయం లో జరిగిన ఒక ‘డ్రిల్’ కి సంబంధించినదని తెలిసింది. ‘Dakaractu Tv’ న్యూస్ రిపోర్ట్ ద్వారా, ఆ డ్రిల్ ని విమానాశ్రయం లో అత్యవసర పరిస్థితులు ఏర్పడినపుడు అక్కడి సిబ్బంది దానిని ఎంత సమర్ధవంతంగా ఎదురుకుంటారో నిర్ధారించడానికి నిర్వహించారని తెలుస్తుంది. ఆ వీడియో లోని డ్రిల్ ని చేపట్టిన ఆర్గనైజర్ జేవియర్ మేరీ (LAS (లిమాక్-ఐబ్ద్-సుమ్మా) డైరెక్టర్ జనరల్) మాట్లాడుతూ, ఆ డ్రిల్ కి విమానాన్ని అందించినందుకు గానూ ‘Air Senegal’ కి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, ఈ వీడియో చైనా లో మొట్టమొదటి కొరోనా వైరస్ కేసు (డిసెంబర్ 2019) నిర్ధారణ అవ్వడానికంటే ఒక నెల ముందు జరిగిన ఘటనది. వీడియో లోని ఘటన కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వీడియో సెనెగల్ దేశం లోని ఒక విమానాశ్రయంలో జరిగిన ‘మాక్ డ్రిల్’ కి సంబంధించినది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll