Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని చూపిస్తూ హిందూవులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేతపై జరిగిన దాడి అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

0

హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లీడర్ ఫూల్ సింగ్ ప్రత్యశీ ని ఇరగ్గొట్టిన ప్రజలు అని చెప్తూ, ఒక వ్యక్తిని జనాలు కొడుతున్న వీడియోని షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లీడర్ ఫూల్ సింగ్ ప్రత్యశీని ప్రజలు కొడుతున్న వీడియో.

ఫాక్ట్(నిజం):  ఈ వీడియో 2016లో BJP కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్ లోని ఆసన్ సోల్ లో పర్యటించినప్పుడు TMC కార్యకర్తలు వారిపై దాడి చేసినప్పటిది. ఈ వీడియోలో దెబ్బలు తింటున్న వ్యక్తి ఒక BJP కార్యకర్త, పైగా ఈ దాడి హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జరగలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోలో జరిగిన ఘటన గురుంచి ప్రచురించిన ఒక 2016 వార్తా కథనం వీడియో మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం BJP కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్ లోని ఆసన్ సోల్ లో పర్యటించినప్పుడు TMC పార్టీ సభ్యులు వారిపై జరిపిన దాడి చేసారు. ఐతే పోస్టులో ఉన్న వీడియో ఈ దాడిలో భాగంగా ఒక BJP కార్యకర్తని కొట్టి అతని బట్టలు చింపేసిన ఘటనకి సంబంధించింది. దీన్నిబట్టి ఈ వీడియో లో దెబ్బలు తింటున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదని చెప్పొచ్చు. పైగా ఈ కథనంలో ఎక్కడ కూడా హిందువులను దూషించినందుకు దాడి ప్రస్తావనలేదు.

ANI వార్తా సంస్థ ఈ దాడికి సంబంధించిన ఫోటోలోను తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ దాడికి సంబంధించి మరిన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. 

ఇదే వీడియో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పై జరిగిన దాడిగా వైరల్ అయినప్పుడు FACTLY ఈ వార్తని ఫాక్ట్-చెక్ చేసిన కథనం ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఈ వీడియోలో 2016లో పశ్చిమ బెంగాల్ లో BJP కార్యకర్తపై TMC కార్యకర్తలు దాడి చేసినప్పటిది.

Share.

About Author

Comments are closed.

scroll