Fake News, Telugu
 

ఇది NRC కి మద్దతుగా BJP, RSS చేసిన బైక్ ర్యాలీని కేరళ ప్రజలు అడ్డుకుంటున్న వీడియో కాదు, శబరిమల నిరసనల వీడియో

0

కేరళ లో NRC కి మద్ధతుగా BJP, RSS ర్యాలీ జరుపుతుండగా అక్కడ ప్రజలు ఆగ్రహం చెందారని క్లెయిమ్ చేస్తూ  ఒక పోస్ట్ ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ చేసే క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో కనుక్కుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలో NRC కి మద్ధతుగా BJP, RSS నిర్వహిస్తున్న బైక్ ర్యాలీ అక్కడ ప్రజలు అడ్డుకుంటున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): వీడియోలోని సంఘటన జనవరి 2019 లోనే జరిగింది. శబరిమళ లో స్త్రీల ప్రవేశానికి వ్యతిరేకంగా శబరిమళ కర్మ సమితి వారు జరుపుతున్న ర్యాలీని అక్కడ ప్రజలు దాడి చేస్తూ అడ్డుకుంటున్న దానికి సంబంధించిన వీడియో. కావున, పోస్ట్ లో చేసిన క్లెయిమ్ అబద్ధం.

పోస్టు లోని  వీడియోని ‘InVID’ ప్లగిన్ లో అప్లోడ్ చేసి దానికి సంబంధించిన కీ ఫ్రేమ్స్ ని ‘Yandex’ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టెక్నిక్ ద్వారా వెతకగా  చాలా సెర్చ్ రిజల్ట్స్ కనిపించాయి. అందులో అదే వీడియోని YouTube లో ‘fayis chulliyan’ అనే ఒక యూజర్ జనవరి  3, 2019 నే అప్లోడ్ చేసారని తెలిసింది. అంతేకాక, ఆ వీడియో కింద ఉన్న వివరణ లో ‘Edappal malappuram’ అని ఉంది. దాని ప్రకారం గూగుల్ లో ‘Edappal malappuram జనవరి 3, 2019’ అనే కీ వర్డ్స్ ఉపయోగించి వెతకగా ‘Times of India’ వారు జనవరి 3, 2019న ప్రచురించిన అదే వీడియో కనిపించింది. దాని ప్రకారం, ఆ వీడియో కేరళ లోని మల్లపురం జిల్లా, ఎడప్పల్ దగ్గర  శబరిమల కర్మ సమితి వారు  శబరిమళ గుడిలో యుక్త వయస్సు స్త్రీల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ  జరుపుతున్న ర్యాలీని అక్కడ ప్రజలు దాడి చేస్తూ అడ్డుకుంటున్న దానికి సంబంధించింది అని తెలుస్తుంది.

చివరగా, ఏ సంబంధం లేని ఒక సంవత్సరం క్రితం వీడియోని తీసుకుని కేరళలో NRC కి మద్దతుగా BJP, RSS ర్యాలీ జరుపుతుంటే అక్కడ ప్రజలు వారిపై దాడి చేసారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll