Fake News, Telugu
 

11 మంది న్యూక్లియర్ సైంటిస్టుల మరణాల్లో అనుమానాస్పదమైనది ఏది లేదని 2015 లో మోడీ ప్రభుత్వం లోక్ సభ లో వివరణ ఇచ్చింది

1

నల్లమలలో యురేనియం మైనింగ్ పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2009-2013 మధ్యలో భారతదేశానికి సంబంధించిన 11 మంది న్యూక్లియర్ సైంటిస్టులు అనుమాస్పదంగా మరణించినట్టు భారత ప్రభుత్వం లోక్ సభ లో చెప్పినట్టు తెలిపారు. ఆ మరణాల పై మరికొందరు యూట్యూబ్ వీడియోలు కూడా చేసిపెట్టారు. వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : 2009 – 2013 మధ్యలో భారతదేశానికి సంబంధించిన 11 మంది న్యూక్లియర్ సైంటిస్టులు అనుమానాస్పదంగా మరణించారు.

ఫాక్ట్ (నిజం): 2015 లో ఈ మరణాల పై లోక్ సభ లో అడిగిన ప్రశ్నకి డా. జితేంద్ర సింగ్ (మోడీ ప్రభుత్వంలోని మంత్రి) సమాధానమిచ్చాడు. సైంటిస్టుల మరణాల్లో ఎటువంటి అనుమానం లేదని తెలిపాడు. కావున రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరియు యూట్యూబ్ వీడియోల్లో చెప్పింది తప్పు.  

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరిగ్గా వింటే, 11 మంది న్యూక్లియర్ సైంటిస్టుల మరణాల గురించి లోక్ సభ లో దుష్యంత్ చౌటాలా అడిగినట్టు చెప్తాడు. కావున, ఆ సమాచారంతో లోక్ సభ వెబ్ సైట్ లో వెతకగా, ఆ ప్రశ్న కి సంబంధించిన డాక్యుమెంట్ దొరుకుతుంది. 2015 లో ఈ మరణాల పై  లోక్ సభ లో అడిగిన ప్రశ్నకి డా. జితేంద్ర సింగ్ (మోడీ ప్రభుత్వంలోని మంత్రి) సమాధానమిస్తూ 11 మంది న్యూక్లియర్ సైంటిస్టుల మరణాలల్లో ‘అనుమానాస్పదం’ ఏమీ లేదని తెలిపాడు. ఆ మరణాలన్నిటిని పోలీసు వారు విచారించారని, ఏ ఒక్క మరణాన్ని కూడా అనుమానాస్పదమని వారు తెలుపలేదని తన సమాధానంలో చూడొచ్చు. అంతేకాదు, ప్రతి ఒక్క మరణం కి సంబంధించిన వివరాలు కూడా ఆ సమాధానం కి చెందిన డాక్యుమెంట్ లో చివరకు చూడొచ్చు.

చివరగా, 11 మంది న్యూక్లియర్ సైంటిస్టుల మరణాల్లో ‘అనుమానాస్పదం’ ఏమీ లేదని 2015 లో మోడీ ప్రభుత్వం లోక్ సభ లో వివరణ ఇచ్చింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll