Fake News, Telugu
 

అయోధ్య రామమందిరానికి నీతా అంబానీ బంగారు కిరీటాలు మరియు వెండి విరాళంగా ఇచ్చిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

0

అయోధ్య రామమందిరానికి నీతా అంబానీ 33 కిలోల మూడు బంగారు కిరీటాలు మరియు 1111 కిలోల వెండి విరాళంగా ఇచ్చిందంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అయోధ్య రామమందిరానికి 33 కిలోల మూడు బంగారు కిరీటాలు మరియు 1111 కిలోల వెండి విరాళంగా ఇచ్చిన నీతా అంబానీ.

ఫాక్ట్ (నిజం): అయోధ్య రామమందిరానికి నీతా అంబానీ విరాళం ఇచ్చిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. రామ మందిరం యొక్క నిర్మాణపు బాధ్యతలు చూడవల్సిన ట్రస్ట్ ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి గూగుల్ లో వెతికినప్పుడు, అయోధ్య రామమందిరానికి నీతా అంబానీ విరాళం ఇచ్చిందనే విషయాన్ని ధృవీకరిస్తూ ఎటువంటి సమాచారం లభించలేదు. ఇంతకుముందు అయోధ్య మందిరానికి విరాళాలు అంటూ వైరల్ అయినా ఫేక్ మెసేజ్ల పై FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్  ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

అయోధ్య రామ మందిరం పై సుప్రీమ్ కోర్టు తీర్పు ఇస్తూ, కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలని చెప్పింది. దానిలో భాగంగా ప్రధాని మోడీ పదిహేను మందితో కూడిన ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ లో వెల్లడించారు. కానీ, ఆ ట్రస్ట్ ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉందని ‘The Hindu’ కథనం ద్వారా తెలిసింది.

చివరగా, అయోధ్య రామమందిరానికి నీతా అంబానీ 33 కిలోల మూడు బంగారు కిరీటాలు మరియు 1111 కిలోల వెండి విరాళంగా ఇచ్చిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll