రాయిటర్స్ ఇండియా వారు చేసిన ఒక ట్వీట్ యొక్క ఫోటోని పెట్టి, ‘ఆంధ్రప్రదేశ్ నుండి కియా కంపెనీ తరలిపోతుందంటూ తాము ప్రచురించిన వార్త అబద్ధం అని ఒప్పుకున్న రాయిటర్స్ ఇండియా వార్త సంస్థ’ అని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: కియా ఆంధ్రప్రదేశ్ నుండి తరలిపోతుందంటూ తాము ప్రచురించిన వార్త అబద్ధం అని ఒప్పుకున్న రాయిటర్స్ ఇండియా వార్త సంస్థ.
ఫాక్ట్ (నిజం): కియా మోటార్స్ పై తాము రాసిన వార్తను రాయిటర్స్ ఇండియా వారు పలు సార్లు ట్వీట్ చేసారు. కానీ, ఒక ట్వీట్ లో ‘ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న కియా’ అని రాసారు. ఆ ట్వీట్ తప్పు అని ఇంకో ట్వీట్ చేసారు. ఫోటోలోని ట్వీట్ ని సరిగ్గా చదువుతే, ఆంధ్రప్రదేశ్ నుండి కియా తరలిపోతుంది అనే ఉంటుంది. తాము ప్రచురించిన వార్త అబద్ధం అని రాయిటర్స్ ఇండియా సంస్థ చెప్పలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ చేసిన ఫోటోలోని ట్వీట్ ని ఇక్కడ చూడవొచ్చు. ట్వీట్ ని సరిగ్గా చదువుతే, ఆంధ్రప్రదేశ్ నుండి కియా తరలిపోతుంది అని ఉంటుంది. ఆ ట్వీట్ కింద తాము రాసిన ఆర్టికల్ ని మళ్ళీ పోస్ట్ చేసింది. దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి కియా తరలిపోతుంది అనే ఉంటుంది. వారు తమ ఆర్టికల్ ని డిలీట్ చేయలేదు.
వారు డిలీట్ చేసిన ట్వీట్ యొక్క ఫోటోని ‘న్యూస్ 18’ వారి ఆర్టికల్ లో చూడవొచ్చు. వారు డిలీట్ చేసిన ట్వీట్ లో ‘ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న కియా’ అని రాసి ఉంటుంది. అది తప్పు అని రాయిటర్స్ ఇండియా వారు అన్నారు. ఇప్పటికీ కూడా వారి ఆర్టికల్ లో కియా ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తున్నట్టుగానే ఉంటుంది. వారి ఆర్టికల్ లో కూడా చివర్లో తమ హెడ్లైన్ మార్చినట్టు రాసారు. (కియా ఆంధ్రప్రదేశ్ కి రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ నుండి బయటికి వెళ్తుంది).
అయితే ‘Correction’ అంటూ రాయిటర్స్ ఇండియా వారు చేసిన ట్వీట్ ని తప్పుగా అర్థం చేసుకొని, వార్తా సంస్థలు [సాక్షి (ఆర్కైవ్డ్) మరియు టైమ్స్ అఫ్ ఇండియా (ఆర్కైవ్డ్)] కూడా తప్పుగా ఆర్టికల్స్ ప్రచురించారు. అంతేకాదు, వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ కూడా ఆ ట్వీట్ ని తప్పుగా అర్ధం చేసుకొని పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసింది.
చివరగా, కియా ఆంధ్రప్రదేశ్ నుండి తరలిపోతుందంటూ తాము ప్రచురించిన వార్త అబద్ధం అని రాయిటర్స్ ఇండియా ఒప్పుకోలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?