Fake News, Telugu
 

ఈ రోబో బహ్రెయిన్ రాజు బాడీగార్డ్ కాదు

0

బహ్రెయిన్ రాజు తన రోబో సెక్యూరిటీతో ప్రయాణిస్తున్నాడు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా పోస్టులో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బహ్రెయిన్ రాజు తన రోబో సెక్యూరిటీతో ప్రయాణిస్తున్నాడు.

ఫాక్ట్(నిజం): ఒక వార్తా కథనం ప్రకారం ఈ రోబో పేరు ‘టైటాన్’, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎంటర్ టైన్మెంట్ రోబో. దినిని Cyberstein అనే ఒక బ్రిటిష్ కంపెనీ తాయారు చేసింది, దినిని 2019లో అబూధాబి లో జరిగిన ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (Idex) లో ప్రదర్శించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అచ్చం ఈ వీడియోలో ఉన్న రోబో లాంటి ఫోటోని ప్రచురించిన వార్తా కథనం ఒకటి మాకు కనిపించింది. ఈ కథనం 19 ఫిబ్రవరి 2019న ప్రచురించబడింది. ఈ కథనం ప్రకారం వీడియోలో ఉన్న రోబో పేరు ‘టైటాన్’. దినిని 2019లో అబూధాబి లో జరిగిన ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (Idex) లో ప్రదర్శించారు. ఇంకా ఈ వార్తా కథనం ప్రకారం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎంటర్ టైన్మెంట్ రోబో, దినిని Cyberstein అనే ఒక బ్రిటిష్ కంపెనీ తాయారు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ చూడొచ్చు.

పోస్టులోని వీడియోలో ఉన్న రోబో ని వార్తా కథనంలో ఉన్న రోబో ని పోల్చి చూస్తే రెండిటిలో రోబో వేసుకున్న మిలిటరీ జాకెట్ మరియు రోబో చాతి, చెయ్యి, భుజం భాగాలలో ఉన్న UAE దేశ జెండాలు ఒకేలా ఉన్నాయి. దీన్నిబట్టి పోస్టులో, వార్తా కథనంలో ఉన్నది ఒకే రోబో అని చెప్పొచ్చు. ఐతే వార్తా కథనంలో ఈ ఎగ్జిబిషన్ కి బహ్రెయిన్ రాజు వచ్చాడని గాని, ఈ రోబో బహ్రెయిన్ రాజు బాడీగార్డ్ అని గాని ఎక్కడ ప్రస్తావించలేదు. పైగా ఈ రోబో కి 360 డిగ్రీస్ కెమెరా, పిస్టల్స్ అమర్చారని గాని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్ని బట్టి ఈ రోబోకి బహ్రెయిన్ రాజుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పొచ్చు.

బహ్రెయిన్ రాజు యొక్క రోబో బాడీగార్డ్ గురించి ఎటువంటి వార్తా కథనాలు మాకు కనిపించలేదు.

చివరగా, పోస్టులోని రోబో కి బహ్రెయిన్ రాజుకి ఎటువంటి సంబంధంలేదు.ఈ రోబో పేరు టైటాన్, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎంటర్ టైన్మెంట్ రోబో.

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll