Fake News, Telugu
 

వీడియోలో బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ కనిపించేది ఒక కెనెడియన్ నటుడు, ఆర్యన్ ఖాన్ కాదు

0

ఎయిర్ పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఒక వీడియోని షేర్ చేస్తూ, వీడియోలో మూత్ర విసర్జన చేసింది హిందీ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అని, తను డ్రగ్స్ తీసుకొని ఇలా చేసాడని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ మత్తులో ఎయిర్ పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించింది ట్విలైట్‌ సినిమాలో నటించిన కెనడియన్ నటుడు బ్రోన్సన్ పెల్లెటియర్. ఈ ఘటన డిసెంబర్ 2012లో లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. మద్యం మత్తులో ఎయిర్ పోర్టు ప్రాంగణంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. కోర్టు విచారణలో బ్రోన్సన్ పెల్లెటియర్ దోషిగా తేలడంతో అతనికి కోర్ట్ రెండు సంవత్సరాలు ప్రోబేషన్ విధించింది. ఆర్యన్ ఖాన్‌కు ఈ వీడియోకు ఎటువంటి సంబంధంలేదు, పైగా ఆర్యన్ ఖాన్‌ ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు ఎటుంటి కథనాలు కూడా లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో 2012లో జరిగిన ఒక ఘటనకు సంబంధించింది, పైగా వీడియోలో బహిరంగంగా మూత్ర విసర్జన చేసింది ఆర్యన్ ఖాన్ కాదు. గూగుల్‌లో ఈ వీడియోకి సంబంధించి సమాచారం కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను 2013లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం వీడియోలో బహిరంగంగా మూత్ర విసర్జన చేసింది ట్విలైట్ సినిమాలో నటించిన కెనడియన్ నటుడు బ్రోన్సన్ పెల్లెటియర్. ఈ ఘటన డిసెంబర్ 2012లో లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది, మద్యం మత్తులో ఎయిర్ పోర్టు ప్రాంగణంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు.

కోర్టు విచారణలో బ్రోన్సన్ పెల్లెటియర్ దోషిగా తేలడంతో అతనికి రెండు సంవత్సరాలు ప్రోబేషన్ విధించింది. డిసెంబర్ 2012లో ఈ ఘటన జరిగినప్పుడు రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఆర్యన్ ఖాన్‌కు ఈ వీడియోకు ఎటువంటి సంబంధంలేదు, పైగా ఈ మధ్యకాలంలో లేదా గతంలో ఆర్యన్ ఖాన్ ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు ఎటువంటి రిపోర్ట్స్ కూడా లేవు.

చివరగా, వీడియోలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించేది ఒక కెనడియన్ నటుడు, ఆర్యన్ ఖాన్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll