దుబాయ్‌లో రివాల్వింగ్ టవర్ ప్రారంభమైందంటూ ఒక వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో బిల్డింగ్ లోని కొంత భాగం చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది. ఈ కథనం ద్వారా ఆ బిల్డింగ్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: దుబాయ్‌లో ప్రారంభించిన రివాల్వింగ్ టవర్ వీడియో.
ఫాక్ట్ (నిజం): వైరల్ వీడియోలో కనిపిస్తున్నది ఒక 3D ప్రదర్శన మాత్రమే, నిజంగా బిల్డింగ్ తిరగడం లేదు. పైగా ఈ వీడియోకు, దుబాయ్‌కు ఎటువంటి సంబంధంలేదు. ఈ బిల్డింగ్ అమెరికా డల్లాస్‌లోని AT&T డిస్కవరీ డిస్ట్రిక్ట్‌లోని ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్‌కు ఒక స్క్రీన్ అమర్చి, దీనిపై తరచూ ప్రదర్శనలు చేస్తుంటారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న బిల్డింగ్‌కు దుబాయ్‌కు ఎటువంటి సంబంధంలేదు, ఆ బిల్డింగ్ అమెరికాలో ఉంది. పైగా పోస్టులో చెప్తున్నట్టు ఆ బిల్డింగ్ నిజంగా తిరగట్లేదు.
వైరల్ అవుతున్న వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, బిల్డింగ్ తిరుగుతున్న దృశ్యాలను వేరే ఆంగిల్‌లో షూట్ చేసిన వీడియోను నవంబర్ 2021లో షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్టు మాకు కనిపించింది. ఈ పోస్టులోని వివరణ ప్రకారం ఆ వీడియోలో ఉన్నది డల్లాస్‌లోని AT&T డిస్కవరీ డిస్ట్రిక్ట్‌లోని ఒక బిల్డింగ్ (మీడియా వాల్).

ఈ ఫేస్‌బుక్ పోస్టు ఆధారంగా గూగుల్‌లో వెతకగా తెలిసిన సమాచారం ప్రకారం AT&T డిస్కవరీ డిస్ట్రిక్ట్‌లోని ఒక బిల్డింగ్‌కు ఒక స్క్రీన్ అమర్చారు, దీనిని మీడియా వాల్ అని అంటారు. ఈ స్క్రీన్‌పై తరచూ ప్రదర్శనలు జరుగుతాయి. ఇలా ఆ స్క్రీన్‌పై జరిగిన కొన్ని ప్రదర్శనలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

వైరల్ వీడియోలో కనిపిస్తున్నది కూడా ఈ మీడియా వాల్‌పై ప్రదర్శించిన ఒక 3D ఇల్యూషన్ మాత్రమే. నిజంగా బిల్డింగ్ తిరగలేదు. ఇకపోతే దుబాయ్‌లో నిజంగానే ఇలాంటి ఒక బిల్డింగ్ ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు.
చివరగా, దుబాయ్‌లో రివాల్వింగ్ టవర్ ఏది ప్రారంభం కాలేదు. ఈ వీడియోలో కనిపిస్తున్నది కేవలం ఒక 3D ప్రదర్శన మాత్రమే.