Fake News, Telugu
 

రాజీవ్, సోనియా గాంధీల వివాహం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరిగిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

రాజీవ్, సోనియా గాంధీల వివాహం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరిగిందని చెప్తూ, ఒక ఫొటోతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. పోస్ట్‌లోని క్లెయిమ్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాజీవ్ మరియు సోనియా గాంధీల వివాహం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరిగింది.

ఫాక్ట్: రాజీవ్ మరియు సోనియా గాంధీల వివాహానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో చూడగా, ఎక్కడా కూడా వారు పోస్ట్‌లోని ఫోటోలో ఉన్న దుస్తుల్లో కనిపించలేదు. ఆ ఫోటో అసలు వారి వివాహానికి సంబంధించిందని చెప్పడానికి ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు. అంతేకాదు, వారి వివాహం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరిగిందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

రాజీవ్ మరియు సోనియా గాంధీల వివాహం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, వారి వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చింది. ఆ వీడియోలో ఎక్కడా కూడా పోస్ట్‌లోని ఫోటోలో ఉన్న దుస్తుల్లో వారు కనిపించలేదు. వాళ్లిద్దరూ దండలతో ఉన్నట్టు వీడియోలో చూడవచ్చు.

వారి వివాహానికి సంబంధించిన ఫొటోల్లో కూడా వారు బొట్టు పెట్టుకొని, దండలతో ఉన్నట్టు చూడవచ్చు. ఆ ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

రాజీవ్ మరియు సోనియా గాంధీల వివాహం 25 ఫిబ్రవరి 1968న జరిగింది. 26 ఫిబ్రవరి 1968 నాడు ‘ది ఇండియన్ ఎక్సప్రెస్’ వారు ఆ వివాహానికి సంబంధించి ప్రచురించిన అర్టికల్‌లో రాజీవ్ గాంధీ మరియు సోనియా మైనో వేద మంత్రాల మధ్య దండలు మార్చుకుని, రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి, మరియు ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నట్టు చదవచ్చు.

అంతేకాదు, వారి వివాహం గురించి వివిధ పుస్తకాల్లో కూడా చదవచ్చు (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). ఎక్కడా కూడా వారి వివాహం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరిగిందని లేదు. పోస్ట్‌లోని ఫోటో గురించి కచ్చితమైన సమాచారం మాకు లభించలేదు. అయితే, రాజీవ్ మరియు సోనియా గాంధీల వివాహానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో చూడగా, ఎక్కడా కూడా వారు పోస్ట్‌లోని ఫోటోలో ఉన్న దుస్తుల్లో కనిపించలేదు. వారి వివాహం క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగిందని కొందరు ఇంతకముందు షేర్ చేయగా, అది తప్పు అంటూ 2018లో ‘ది ప్రింట్’ వారు ప్రచురించిన అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.

చివరగా, రాజీవ్ మరియు సోనియా గాంధీల వివాహం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరిగిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll