Fake News, Telugu
 

భారత రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కి చెరవేయడానికి షారూఖ్ ఖాన్ బర్ఖా దత్‌కి శాటిలైట్ ఫోన్ కొనిచ్చాడనటానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

కార్గిల్ యుద్ధ సమయంలో భారత రక్షణ సిబ్బంది వివరాలను, బంకర్ల ఆచూకీను పాకిస్థాన్‌కి తెలియజేయడానికి షారూఖ్ ఖాన్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌కి ఒక శాటిలైట్ ఫోనుని కొనిచ్చారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రచారంలో ఉంది. బర్ఖాదత్ కార్గిల్ యుద్ధ సమయంలో సైనికుల సమాచారాన్ని రిపోర్ట్ చేయడం వలన వందలాది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవలిసి వచ్చిందని ఈ పోస్టులో పేర్కొన్నారు. షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం 2023 జనవరి 25న విడుదలైన నేపథ్యంలో, ఈ సినిమాను ప్రజలు బహిష్కరించాలని కోరుతూ పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైనికుల రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కి తెలియజేయడానికి షారూఖ్ ఖాన్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌కి ఒక శాటిలైట్ ఫోనుని కొనిచ్చారు.

ఫాక్ట్ (నిజం): జర్నలిస్ట్ బర్ఖాదత్ కార్గిల్ యుద్ధాన్ని లైవ్ రిపోర్టింగ్ చేయడం వలన ఒకానొకసారి తమ ఆపరేషన్ గోప్యతకు ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తిందని జనరల్ మోహిందర్ పూరి 2015లో విడుదల చేసిన తన ‘Kargil: Turning the Tide’ పుస్తకంలో తెలిపారు. కానీ, అందువలన భారత సైన్యానికి ప్రాణహాని జరిగిందని మోహిందర్ పూరీ తన పుస్తకంలో చెప్పలేదు. కార్గిల్ యుద్ధాన్ని దేశప్రజలు వీక్షించడానికి బర్ఖా దత్ డైనమిక్ రిపోర్టింగ్ ముఖ్య కారణమని మోహిందర్ పూరి తన పుస్తకంలో బర్ఖాదత్‌ను ప్రశంసించారు. కార్గిల్ యుద్ద సమయంలో భారత రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కి చెరవేయడానికి షారూఖ్ ఖాన్ బర్ఖాదత్‌కి శాటిలైట్ ఫోన్ కొనిచ్చారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైనికుల రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కి చెరవేయడానికి షారూఖ్ ఖాన్ బర్ఖా దత్‌కి శాటిలైట్ ఫోనుని కొనిచ్చారా? అని ఇంటర్నెట్లో వెతికితే, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2015లో షారూఖ్ ఖాన్ 50వ పుట్టినరోజు సందర్భంగా బర్ఖా దత్ షారూఖ్ ఖాన్‌ని ఇంటర్వ్యూ చేసినప్పుడు తీసినది. ఈ ఇంటర్వ్యూలో కార్గిల్ యుద్ధం గురించి వీరిద్దరూ ఎక్కడా సంభాషించలేదు. కార్గిల్ యుద్ద సమయంలో భారత రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కి చెరవేయడానికి షారూఖ్ ఖాన్ బర్ఖా దత్‌కి శాటిలైట్ ఫోనుని కొనిచ్చారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

జర్నలిస్ట్ బర్ఖాదత్ టైగర్ హిల్ ఆపరేషన్‌ను లైవ్ రిపోర్టింగ్ చేయడం వలన ఒకానొకసారి తమ ఆపరేషన్ గోప్యతకు ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తిందని జనరల్ మోహిందర్ పూరి 2015లో లాంచ్ చేసిన తన ‘Kargil: Turning the Tide’ పుస్తకంలో తెలిపారు. కానీ, అందువలన భారత సైన్యానికి ప్రాణహాని జరిగిందని మోహిందర్ పూరి తన పుస్తకంలో చెప్పలేదు.

టైగర్ హిల్ యుద్ధాన్ని దేశప్రజలు వీక్షించడానికి మీడియా ముఖ్యమైన పాత్ర పోషించిందని, ముఖ్యంగా బర్ఖా దత్ డైనమిక్ రీపోర్టింగ్ అందుకు కారణమని మోహిందర్ పూరీ తన పుస్తకంలో బర్ఖాదత్‌ను ప్రశంసించారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 2015లో ఈ పుస్తకం లాంచ్ కార్యక్రమానికి బర్ఖాదత్ కూడా అతిథిగా హాజరయ్యారు. కార్గిల్ యుద్ధాన్ని బర్ఖా దత్ లైవ్ రిపోర్టింగ్ చేయడం వలన వందలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవలిసి వచ్చిందని భారత ఆర్మీ గాని ప్రభుత్వం గానీ ప్రకటించలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే కార్గిల్ యుద్ధానికి సంబంధించి రాసిన ఒక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి బర్ఖా దత్‌ను ముఖ్య అతిథిగా పిలిచే అవకాశం లేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన సమాచారం అవాస్తవమని చెప్పవచ్చు.

చివరగా, కార్గిల్ యుద్ధ సమయంలో భారత రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కి చెరవేయడానికి షారూఖ్ ఖాన్ బర్ఖా దత్‌కి శాటిలైట్ ఫోన్ కొనిచ్చారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll