Fake News, Telugu
 

ఓమిక్రాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు వైరల్ అవుతున్న సమాచారం తప్పు

0

వివరణ (JANUARY 10, 2022): ఇంతకు ముందు 08 జనవరి 2022 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు తప్పు సమాచారం ప్రచారం అయిన నేపథ్యంలో ఈ ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. కానీ ఈ రోజు (10 జనవరి 2022) రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు సీఎం వై.ఎస్‌.జగన్‌ అధికారులను ఆదేశించినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవొచ్చు. 31 జనవరి 2022 వరకు ఈ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది, కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలను మరియు మినహాయింపులను ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఆర్టికల్‌లోని జత చేసిన జీవోలో చూడవొచ్చు.

కరోనా వైరస్, ఓమిక్రాన్ కేసుల నియంత్రణ చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ తమ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 08 జనవరి 2022 నుంచి రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 5:00 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న థియేటర్స్, హోటల్స్, రెస్టారెంట్లు అన్ని యాబై శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడిపించాలని వై. యెస్. జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఇదే విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పలు వెబ్సైట్స్ ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేసాయి. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్ద్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా వైరస్ కేసుల నియంత్రణ చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ తమ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుంది.

ఫాక్ట్ (నిజం):  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాచారం తప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాకు స్పష్టం చేసింది. అలాగే, థియేటర్స్, హోటల్స్, రెస్టారెంట్లు అన్ని యాబై శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో ఈ విధమైన అసత్య సమాచారం ప్రచారం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మీడియా ద్వారా హెచ్చరించారు. నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నుండి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని ఆంధ్రప్రదేశ్  ట్రాఫిక్ అడిషనల్ డిప్యుటీ కమిషనర్ సి. హెచ్. ఆదినారాయణ మీడియాకు తెలిపారు. ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

సోర్స్ లింకులు:
1. https://telugu.samayam.com/andhra-pradesh/news/andhra-pradesh-imposed-night-curfew-10-pm-to-5-am-from-saturday/articleshow/88756643.cms
2. https://www.thehindu.com/news/national/andhra-pradesh/fake-messages-on-lockdown-and-other-restrictions-being-circulated-on-social-media/article38189600.ece
3. https://tv9telugu.com/andhra-pradesh/ap-government-clarity-on-night-curfew-in-state-here-is-the-detail-613196.html
4. https://telugu.asianetnews.com/andhra-pradesh/ys-jagan-government-clarity-on-night-curfew-in-andhra-pradesh-r5du3w

Share.

About Author

Comments are closed.

scroll