Fake News, Telugu
 

భారతదేశ విభజన జరగడానికి తనే స్వయంగా నిర్ణయం తీసున్నానని ఇంటర్వ్యూలో నెహ్రూ గొప్పగా చెప్పలేదు

0

‘దేశవిభజన నిర్ణయం తానే స్వయంగా తీసుకున్నానని, 1964 లో తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో గొప్పగా ఒప్పుకున్న నెహ్రు’, అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దేశవిభజన నిర్ణయం తానే స్వయంగా తీసుకున్నానని 1964 ఇంటర్వ్యూలో నెహ్రూ గొప్పగా చెప్తున్న వీడియో.

ఫాక్ట్: భారతదేశ విభజన జరగడానికి తను స్వయంగా నిర్ణయం తీసున్నానని ఇంటర్వ్యూలో నెహ్రూ గొప్పగా చెప్పలేదు. దేశ విభజన కోసం ముస్లిం లీగ్ నెలకొల్పిన పరిస్థితుల్లో, తాను కూడా మిగితా వారి లాగే, నిరంతర ఇబ్బందుల కంటే విభజన మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపాడు. అప్పటి పరిస్థితుల వల్ల నెహ్రూ కూడా చివరకు విభజన జరగడానికి ఒప్పుకోవటం వాస్తవమే అయినా, దేశవిభజనకు తానే కారణం అని నెహ్రు ఇంటర్వ్యూలో గొప్పగా ఒప్పుకున్నట్టు పోస్ట్ లో చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

వీడియోని సరిగ్గా గమనిస్తే, కుడివైపు పైన ‘దూరదర్శన్ ఆర్కైవ్స్’ అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కావున, కీ-వర్డ్స్ తో ఇంటర్నెట్‌లో వెతకగా, ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన 45 నిమిషాల వీడియోని ‘Prasar Bharati Archives’ వారు తమ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలో ఆడియో క్లియర్‌గా ఉన్నట్టు వినొచ్చు. పోస్ట్ చేసిన వీడియోలోని సంభాషణ 14:33 దగ్గర మొదలవుతది. దానికి సంబంధించిన తెలుగు అనువాదం కింద చదవొచ్చు.

Interviewer: “You and Mr. Gandhi and Mr. Jinnah. You were all involved at that point of Independence and then partition….in the fight for Independence of India from the British domination.” (మీరు, గాంధీ, జిన్నా ముగ్గురు అప్పుడు బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర కోసం పోరాటం చేసారు మరియు తరువాత విభజనలో కూడా పాల్గొన్నారు).
Nehru:Mr.Jinnah was not involved in the fight for Independence at all. In fact, he opposed it. Muslim League was started in about 1911, I think. It was started really by the British, encouraged by them so as to create factions…..they did succeed to some extent. And ultimately, there came the partition.”  (జిన్నా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. నిజానికి అతను వ్యతిరేకించాడు. ముస్లిం లీగ్‌ని సుమారు 1911 సమయంలో బ్రిటిష్ వారు మొదలుపెట్టారు; వివిధ వర్గాలుగా విడగొట్టడానికి. వారు కొంతవరకు విజయం కూడా సాధించారు. చివరకు, విభజన జరిగింది)

Interviewer: “You and Mr. Gandhi in favour of that?” (మీరు మరియు గాంధీ విభజనకు అనుకూలమా?)
Nehru:Mr. Gandhi was not in favour of it right to the end. Even it came, he was not in favour of it. I was not in favour of it either. But ultimately, I decided, like many others did, it is better to have partition than this constant trouble.” (గాంధీ చివరి వరకు దానికి అనుకూలంగా లేడు. విభజన అయ్యాక కూడా అతను దానికి అనుకూలంగా లేడు. నేను కూడా విభజనకు అనుకూలంగా లేకుండే. కానీ చివరికి, నేను కూడా మిగితా వారి లాగే, నిరంతర ఇబ్బందుల కంటే విభజన మంచిదనే నిర్ణయానికి వచ్చను.) “And, you see, the leaders of the Muslim League were big landlords…..who did not like land reforms. We were very anxious to have land reforms, which we did have afterwards. That was one reason we agreed to partition because we thought that if they remain with us, apart from this trouble continuing, they would oppose many of our measures. And, we said, it is better to have a part of India and go ahead with our program of reforms, etc……” (ముస్లిం లీగ్ నాయకులు పెద్ద భూస్వాములు…… భూ సంస్కరణలను వారు ఇష్టపడలేదు. భూ సంస్కరణలను చేయడానికి మేము ఆత్రుతగా ఉండే; తరువాత చేసాము కూడా. మేము విభజనకు అంగీకరించడానికి ఇది ఒక కారణం, ఎందుకంటే వారు మాతోనే ఉంటే, ఈ ఇబ్బంది కొనసాగడమే కాకుండా, మిగితా వాటిని కూడా వ్యతిరేకించేవారు. భారతదేశంలో కొంత భాగాన్ని తీసుకొని, మా సంస్కరణల కార్యక్రమాలతో ముందుకు సాగడం మంచిదని అనుకున్నాము…)

పై ఇంటర్వ్యూలో భారతదేశ విభజన జరగడానికి తను స్వయంగా నిర్ణయం తీసున్నానని నెహ్రూ గొప్పగా చెప్పలేదు. దేశ విభజన కోసం ముస్లిం లీగ్ నెలకొల్పిన పరిస్థితుల్లో, తాను కూడా మిగితా వారి లాగే, నిరంతర ఇబ్బందుల కంటే విభజన మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపాడు.

1944 లో నెహ్రు రాసిన ‘డిస్కవరీ అఫ్ ఇండియా’ పుస్తకంలో కూడా విభజన వల్ల వచ్చే నష్టాల గురించి తాను రాసినట్టు ఇక్కడ చదవొచ్చు.

మౌంట్‌బాటెన్ విభజన ప్లాన్‌ని జూన్ 1947 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించినట్టు ఇక్కడ చదవొచ్చు. మౌంట్‌బాటెన్‌తో చర్చల్లో నెహ్రూ తో పాటు సర్దార్ పటేల్ కూడా పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ఫోటో మరియు వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

తాను విభజనకు ఎందుకు అంగీకరించానో రాజ్యాంగ సభ లో సర్దార్ పటేల్ చెప్పిన మాటలను ఇక్కడ చదవొచ్చు.

చివరగా, భారతదేశ విభజన జరగడానికి తను స్వయంగా నిర్ణయం తీసున్నానని ఇంటర్వ్యూలో నెహ్రూ గొప్పగా చెప్పలేదు. దేశ విభజన కోసం ముస్లిం లీగ్ నెలకొల్పిన పరిస్థితుల్లో, తాను కూడా మిగితా వారి లాగే, నిరంతర ఇబ్బందుల కంటే విభజన మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపాడు.

Share.

About Author

Comments are closed.

scroll