Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

‘కొరోనా వ్యాధి వచ్చిన 20,000 మంది ని చంపడానికి కోర్టు పర్మిషన్ కోరిన చైనా ప్రభుత్వం’ అనేది ఫేక్ వార్త

0

కొరోనా మరీ ఎక్కువ వ్యాపించకుండా ఉండేందుకు 20,000 మంది వ్యాధి సోకిన రోగులను చంపేందుకు కోర్ట్ పర్మిషన్ కోరిన చైనా ప్రభుత్వం!!’ అని ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొరోనా వ్యాధి వచ్చిన 20,000 మంది ని చంపడానికి కోర్టు పర్మిషన్ కోరిన చైనా ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో చెప్పిన దానికి ఎటువంటి ఆధారాలు లేవు. 20,000 మంది ని చంపడానికి చైనా ప్రభుత్వం కోర్టు పర్మిషన్ కోరినట్టు మొదటిగా రాసిన వెబ్ సైట్ ఇంతకముందు కూడా చాలా ఫేక్ వార్తలు రాసింది. చైనా సుప్రీమ్ కోర్టు వెబ్ సైట్ లో కూడా ఈ విషయం గురించి ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

కొరోనా వైరస్ వ్యాపించకుండా దాని వల్ల వ్యాధి వచ్చిన వారిని చైనా ప్రభుత్వం చంపాలని చూస్తున్నట్టు ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేదు. కేవలం ‘ab-tc.com’ అనే వెబ్ సైట్ మాత్రమే ఆ  విషయం గురించి మొదటిగా ప్రచురించినట్టు తెలుస్తుంది. అయితే, ఆ వెబ్ సైట్ లోని ఆర్టికల్ (ఆర్కైవ్డ్) చదవగా, వారు రాసిన విషయాలకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. ఆర్టికల్ రాసిన వ్యక్తి పేరు కూడా లేదు. నిజంగా కోర్టు నుండి అటువంటి పర్మిషన్ ని చైనా ప్రభుత్వం కోరితే, ప్రముఖ వార్తాసంస్థలు అన్నీ దాని గురించి రాసేవి. కానీ, ఆ వెబ్ సైట్ తప్ప, ఎటువంటి ప్రముఖ వార్తాసంస్థ కూడా ఆ విషయం గురించి రాయలేదు.

అంతేకాదు, ‘ab-tc.com’ వెబ్ సైట్ వారు తాజాగా సింగపూర్ లో కొరోనా వైరస్ గురించి రాసిన మరొక వార్తా తప్పు అంటూ సింగపూర్ ప్రభుత్వం రిలీజ్ చేసిన మీడియా ప్రకటన ఇక్కడ చూడవొచ్చు. ‘ab-tc.com’ వెబ్ సైట్ వారు ఇలాంటి ఫేక్ వార్తలు ఇంతకముందు కూడా చాలా రాసినట్టు ‘స్నోప్స్’ ఆర్టికల్ లో చదవొచ్చు

చైనా సుప్రీమ్ కోర్టు వెబ్ సైట్ లో కూడా పోస్ట్ లో చెప్పిన దాని గురించి ఎటువంటి సమాచారం లేదు.

చివరగా, ఫేక్ వార్తలు రాసే వెబ్ సైట్ రాసిన ఒక వార్తను తీసుకొని కొరోనా వ్యాధి వచ్చిన 20,000 మందిని చైనా చంపడానికి చూస్తుంది అని షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll