Fake News, Telugu
 

రుణమాఫీ గురించి ప్రశ్నించే రైతులని జైలుకి పంపుతానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనలేదు

0

పల్లె ప్రగతి సమావేశంలో రుణమాఫీ గురించి ప్రశ్నించే రైతులని జైలుకి పంపుతానని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వార్నింగ్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఒక వార్తాకథనం ఫోటో షేర్ అవుతుంది. ఆ వార్తాక థనంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పల్లె ప్రగతి సమావేశంలో రుణమాఫీ గురించి ప్రశ్నించే రైతులని జైలుకి పంపుతానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వార్నింగ్ ఇచ్చారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వార్తాకథనం ఎడిట్ చేయబడినది. జగిత్యాల జిల్లా మెట్లచిట్టాపూర్ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి సమావేశంలో ఒక రైతు, మంత్రి దయాకర్ రావుని రుణమాఫీ ఎందుకు అమలు చేయట్లేదని నిలదీసారు. మంత్రి దయాకర్ రావు అతన్ని బీజేపీ కార్యకర్తగా భావించి సమావేశం నుండి బయటకి పంపేసారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గడం వల్ల రుణమాఫీ అమలు చేయడంలో జాప్యం జరిగిందని , తొందర్లోనే రుణమాఫీ అమలు చేస్తామని దయాకర్ రావు ఆ సమావేశంలో చెప్పారు. రుణమాఫీ గురించి ప్రశ్నించే రైతులని జైలుకి పంపుతానని ఎర్రబెల్లి దయాకర్ రావు ఎక్కడా అనలేదు. దీనికి సంబంధించి ఏ వార్తా సంస్థ కథనం పబ్లిష్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌కు సంబంధించిన వివరాల కోసం కొన్ని పదాలు వాడి గూగుల్ లో వెతికితే, పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రుణమాఫీ గురించి ప్రశ్నించే రైతులని జైలుకి పంపుతానని బెదిరించినట్టుగా ఎటువంటి వార్తా కధనం పబ్లిష్ అవలేదని తెలిసింది. ఒకవేళ, మంత్రి దయాకర్ రావు రైతులకు సంబంధించి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, దానికి సంబంధించి పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి.

06 జూలై 2021 నాడు జగిత్యాల జిల్లా మెట్లచిట్టాపూర్ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి సమావేశంలో గంగా రెడ్డి అనే  రైతు మంత్రి దయాకర్ రావుని రుణమాఫీ ఎందుకు అమలు చేయట్లేదని నిలదీసారు. రుణమాఫీ గురించి ప్రశ్నించిన గంగా రెడ్డిని దయాకర్ రావు ‘నీది ఏ పార్టీ’ అని ప్రశ్నించారు. పక్కన ఉన్న తెరాస కార్యకర్తలు అతను బీజేపీ కార్యకర్త అనడంతో, మంత్రి  దయాకర్ రావు అతన్ని పోలీసుల సహాయంతో సమావేశం నుండి బయటకి పంపించేసారు. ఈ ఘటనకు సంబంధించి ‘V6 వెలుగు’ వార్తాపత్రిక 07 జూలై 2021 నాడు ఒక కథనం పబ్లిష్ చేసింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిందని, తొందోర్లోనే రుణమాఫీ అమలు చేస్తామని దయాకర్ రావు ఆ సమావేశంలో చెప్పారు.

మెట్లచిట్టాపూర్ గ్రామ పల్లె ప్రగతి సమావేశంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని వార్తా కధనాలు, వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. రుణమాఫీ గురించి ప్రశ్నించే రైతులని జైలుకి పంపుతానని ఎర్రబెల్లి దయాకర్ రావు ఎక్కడా అనలేదు. ఈ విషయాన్ని తెలుపుతూ ఏ వార్తా సంస్థ  కథనం పబ్లిష్ చేయలేదు.

చివరగా, రుణమాఫీ గురించి ప్రశ్నించే రైతులని ఎర్రబెల్లి దయాకర్ రావు జైలుకి పంపుతానని బెదిరించినట్టుగా షేర్ చేస్తున్న ఈ వార్తాకథనం నిజం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll